జీర్ణాశయంలో అల్సర్లు ఎందుకు వస్తాయంటే..?

జగిత్యాల:శరీరంలో యాసిడ్లు అందాల్సిన స్థాయి కన్నా తక్కువున్నా లేక అధికమైనా జీర్ణాశయంలో అల్సర్లు ఏర్పడతాయి. వీటిని గ్యాస్ట్రిక్ అల్సర్లుగా పిలుస్తారు. ఆ హారం తిన్న తర్వాత పేగుల్లో ఒత్తిడి బాగా పెరిగి,పేగుల గోడలు సాగినట్లై అల్సర్‌ ప్రాంతం నొప్పి అనిపించవచ్చు.దీన్ని ప్రెజర్‌ పెయిన్‌ అని అంటారు.జీర్ణవ్యవస్థలో ఉం డే గాఢమైన యాసిడ్లు పేగుల్లోని ఈ పుండ్లపై పడినప్పుడు తీవ్రమైన మంట రావచ్చు.అందుకే ఈ సమస్య ఉన్న వారికి భోజనం తర్వాత కడుపులో మంటగా ఉండ టం,అసౌకర్యంగా అనిపించడం జరుగుతుంది.ఛాతిలో మంట,నొప్పి,గ్యాస్‌,అసిడిటీ,అజీర్ణం,వికారంలాంటి లక్షణాలన్నీ కడుపులో అల్సర్లు ఉన్నాయని తెలిపే సూచ నలే.కారణాలు:దాదాపు 80 శాతం మందిలో గ్యాస్ట్రో అల్సర్లు రావడానికి హెలికో పైలోరి అనే బ్యాక్టీరియా కారణమవుతుంది.దీనికి తోడు అస్తవ్యస్తమైన జీవన విధా నం,ఆహార నియమాలు పాటించకపోవటం,కారం,మసాలాలు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవటం,ఒత్తిడి,ఆందోళన,పెయిన్‌ కిల్లర్స్‌,యాంటీ బయోటిక్‌ మందుల్ని విచక్షణారహితంగా వాడటం,మద్యపానం,ధూమపానం,పొగాకు నమలటం,కాఫీలు ఎక్కువగా తాగటం,క్యాన్సర్‌ మొదలైన అనేక కారణాల వల్ల జీర్ణాశయంలో అల్సర్లు తయారవుతాయి.అల్సర్లు రావడానికి ముఖ్య కారణం అస్తవ్యస్తమైన జీవన విధానమే.ముఖ్యంగా 60 ఏళ్ళు పైబడిన వారు,మహిళలే ఈ సమస్యతో ఎక్కువగా బాధ పడుతున్నారు.పూజలు,వ్రతాల పేరిట ఆహార స్త్రీలు నియమాలను నిర్లక్ష్యం చేయడమే అందుకు కారణం.లక్షణాలు:గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్య ఉన్నవారిలో కడుపులో నొప్పి,మంట,ఉబ్బరం,పుల్లటి త్రేన్పులు,మలబద్దకం,ఛాతిలో నొప్పి,తలనొప్పి,బరువు తగ్గడం,రక్తపు వాంతులు,రక్త విరేచనాలు ఉంటాయి.కొంచెం తినగానే పొట్ట నిం డుగా అనిపించడం,ఆకలి తగ్గిపోవడం,ఎక్కువగా నోట్లో నీరు ఊరడం జరుగుతుంది.ఈ లక్షణాలు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.ఈ సమస్యను దీర్ఘకాలం పాటు నిర్లక్ష్యం చేస్తే అది క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది.ఎక్స్‌రే,ఎండోస్కోపి,రక్తపరీక్షలు,బయాప్సి లేదా ముక్క పరీక్ష,మలపరీక్షల ద్వారా వ్యాధిని నిర్దారిస్తా రు.జాగ్రత్తలు:అల్సర్లు రాకుండా వుండాలంటే నిత్యం మూడు పూటలా కచ్చితంగా ఒకే సమయానికి ఆహారం తీసుకోవాలి.శుభ్రమైన నీటినే తాగాలి.కలుషిత నీరు తా గరాదు.ఒత్తిడి,ఆందోళన తగ్గించుకోవాలి.ధూమ,మద్యపానాలు మానేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here