మోడీ విజ్ఞప్తితో..ముగిసిన కుంభమేళా

న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రాంలోని హరిద్వార్ లో జరగుతున్న కుంభమేళాని కేవలం లాంఛనప్రా యంగానే నిర్వహించాలని,భక్తులు లేకుండా చూడాలని కరోనాపై పోరాటానికి ఇది తోడ్పడుతుందని ప్రధాని మోడీ పిలునిచ్చిన కొద్ది గంటల్లోనే కుంభమేళాపై నిర్వాహ కుల నుంచి కీలక ప్రకటన వెలువడింది.ఏప్రిల్-1న ప్రారంభమైన కుంభమేళా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్-30వరకు కుంభమేళా నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ముందుగా నే కుంభమేళాని ముగిస్తున్నట్లు శనివారం సాయంత్రం హిందు ధర్మ ఆచార్య సభ అధ్యక్షుడు,జునా అఖార హెడ్ స్వామి అవధేశానంద్ గిరి ట్వీట్ చేశారు.ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.ప్రధానమంత్రి సలహా మేరకు మిగిలిన రెండు రాజ స్నానాలను(షాహీ స్నాన్) లాంఛనప్రా యంగానే నిర్వహించాలని ఇతర అఖారాలకు చెందిన సాధువులకు వీడియో మెసేజ్ లో విజ్ణప్తి చేశారు.కాగా హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాలో ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 14 మధ్య 1700 మందికి పైగా కరోనా బారిన పడ్డారు.ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హిందు కార్యక్రమం కావడంతో దీన్ని ఇంకా కొనసాగిస్తే కరోనా కేసులు మరింత పెరుగుతాయనే విమర్శలు వస్తున్నాయి.హరిద్వార్,తెహ్రీ,డెహ్రాడూన్,రిషికేష్ మొత్తం కలిపి కుంభమేళా 670 హెక్టార్లలో జరుగుతోంది.మొత్తం 48.51 ల క్షల మంది ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 14 మధ్య రెండేసి షాహీ స్నానాలు చేశారు.వారిలో చాలా మంది మాస్కులు ధరించలేదు.సోషల్ డిస్టాన్స్ సరిగా అమలు కా లేదు.పోలీసులు కూడా ఏమీ చెయ్యలేకపోయారు.ఇప్పుడు ప్రధానమంత్రి స్వయంగా కోరారు కాబట్టి ఇక కుంభమేళాను ముందుగానే ముగిస్తున్నట్లు ప్రకటన వెలు వడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here