తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం

●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.

●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.

●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.

●మాస్టర్ గడ్డం వెంకటస్వామి

హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన తైక్వండో జూనియర్స్ బెల్ట్ టెస్ట్ లో విజయం సాధించి “పుమ్ సే”ప్రదర్శన చేసిన చిన్నారులకు తైక్వండో,కరాటే మాస్టర్(తైక్వండో జిల్లా సెక్రటరీ)గడ్డం వెంకట స్వామి బెల్టుల ప్రదానోత్సవం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువత పాశ్చత్య దేశాల సంస్కృతి,విచ్చలవిడి తనం వల్ల క్రమ శిక్షణ లేకుండా పెరుగుతున్నారని,తద్వారా అసాంఘిక కార్య కలాపాల వైపు ఆకర్షితులై గంజాయి మద్యపానం లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి వారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. తల్లి తండ్రులు వారి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం విద్య బుద్ధులతో పాటు శారీరక మానసిక ఎదుగుదలకు తైక్వాండో శిక్షణ అందించా లని,తైక్వాండో నేర్చుకోవడం వల్ల క్రమ శిక్షణ కలిగిన జీవితం అలవడుతుందన్నారు.అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కల్గిన తైక్వాండో కు స్పోర్ట్స్ కోటాలో ప్రత్యేక స్థానం వుంటుందని,తెలిపారు.అంతేకాకుండా ఆత్మ రక్షణ కోసం ప్రధానంగా ఆడపిల్లలకు తైక్వాండో శిక్షణ అత్యంత అవసరమని పేర్కొన్నారు.రానున్న వేసవి సెలవుల్లో ప్రత్యేక సమ్మర్ క్యాంప్ నిర్యాహిస్తామని ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి ఉపయెగించుకోవాలని కోరారు.ఈ క్రింది నెంబర్లను 9441558369. 9848764889 సంప్రదించాలని తెలిపారు.ఈ పోటీ పరీక్షలో మామునూరి స్రమజ సంపత్ బ్లూ వన్ బెల్ట్,మామునూరి సహస్ర సంపత్ బ్లూ వన్ బెల్ట్, ఎల్.రితిక ఎల్లో బెల్ట్ పి.శ్రీతిక్ రెడ్ బెల్ట్ వి.వైశ్విక్ రెడ్ బెల్ట్ వి.ధృవ నిర్వాన్ బ్లూ వన్ బెల్ట్,జి.సాకేత్ రెడ్డి,రెడ్ బెల్ట్ సాధించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎం.రామ్ బాబు,అక్షయ బ్లాక్ బెల్ట్,కోచ్ పూర్ణ బ్లాక్ బెల్ట్,సంపత్ మామునూరి కోచ్ బ్లాక్ బెల్ట్,కరాటే,తైక్వండోమాస్టర్ గడ్డం వెంకటస్వామి తదితరులు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here