వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వచనాలను అందించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపా రు.స్వామి వారి దివేనతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ దంపతులు,జెడ్.పి చైర్మన్ న్యాలకొండ అరుణ,జిల్లా పాలనాధికారి అనురాగ జయంతి,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్,మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి-రాజు,సెస్ చైర్మన్ చిక్కాల రామా రావు,అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్,ఆర్.డి.ఓ శ్రీనివాస రావు లు పాల్గొన్నారు.తదితరులు ఉన్నారు.
