మర్కజ్‌కో న్యాయం?కుంభమేళాకో న్యాయమా?ఇదెక్కడి న్యాయం..

న్యూఢిల్లీ:కరోనా వైరస్ అనేది మొదటిసారి దేశంలోకి ప్రవేశించినప్పుడు అందరివేళ్లు ఢిల్లీ మర్కజ్‌వైపే చూపించాయి.విదేశాల నుంచి వచ్చిన ముస్లింలు సామూహి కంగా ప్రార్థనలు చేయడంవల్లే కరోనా వ్యాప్తి చెందిందని,అక్కడ ప్రార్థనలు చేసినవారు దేశవ్యాప్తంగా సంచరించడతో ఢిల్లీ నుంచి గల్లీ వరకు వైరస్ పాకిపోయిందంటూ విమర్శించారు.ఆ మర్కజ్‌పై ప్రభుత్వంపై కఠినమైన ఆంక్షలు విధించింది.ఇప్పుడు మర్కజ్‌ను అందరూ మర్చిపోయారు.కరోనా రెండోదశలో మర్కజ్‌తో పోలిస్తే ఇసు కేస్తే రాలనంత జనం కుంభమేళాకు హాజరయ్యారు.తొలి రోజే ముఫ్పై లక్షల మంది గంగానదిలో స్నానాలు చేశారు.ఇంకా లక్షల మంది కుంభమేళాకు వెళుతూనే ఉ న్నారు.కేంద్ర ప్రభుత్వం దేశం నలుమూలల నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.అక్కడ నుంచి కరోనా వ్యాప్తిచెందుతుందని వెళ్లవద్దని ఎవరూ ప్రచారం చేయడం లేదు. జాగ్రత్తగా ఉండమని ఏ ప్రభుత్వమూ చెప్పడంలేదు.అత్యవసర సమావేశాలు నిర్వహించడంలేదు.ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్ధలై లావా ఎగజిమ్మినట్లు కరోనా పుట్ట బద్దలైంది.రోజురోజుకూ అక్కడ కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి.నాగ సాధువులే కరోనా బారిన పడుతుంటే సామాన్య భక్తుల సంగతి సరేసరి.మౌనం వీడని పాలకులు:కర్ణాటక వంటి రాష్ట్రాలు కుంభమేళాకు వెళ్లొచ్చిన వాళ్లు కచ్చితంగా పరీక్షలు చేయించుకుని హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచనలు చేస్తున్నా యి.ఇతర రాష్ట్రాలు కనీసం ఆ సూచనలు కూడా చేయడంలేదు.కరోనా రెండోదశలో కుంభమేళా సూపర్ స్ప్రెడర్‌గా ఉండటం ఖాయమనిపిస్తోంది.మర్కజ్ విషయంలో ప్రచారం చేసిన మీడియా ఇప్పుడు అవగాహన కల్పించడంలో విఫలమవుతోంది.కేంద్రంలోని ప్రభుత్వ పెద్దలు కూడా ఏమీ మాట్లాడటంలేదు.అన్ని వేలమంది అన్ని లక్షల మంది వస్తారని తెలిసినా కరోనా రెండోదశ ఉధృతి దారుణంగా ఉందని తెలిసినా మౌనం వీడని మన పాలకులు పెదవి విప్పడంలేదు.దీంతో సహజంగానే దేశం లో మతం రంగు పులుముకుంటోంది.ముస్లింలకు సంబంధించిది కాబట్టే మర్కజ్‌పై హడావిడి చేశారని హిందువులది కాబట్టే కుంభమేళాపై మాట్లాడటంలేదని దేశ వ్యా ప్తంగా చర్చలు జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here