తెలంగాణలో కొత్తగా 4009 కరోనా కేసులు..

హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.గత కొద్దిరోజులుగా వరుసగా 4వేల మార్క్‌ను దాటుతున్నాయి.శనివారం(ఏప్రిల్ 17) రాత్రి 8గం.నుంచి ఆదివారం రాత్రి 8గం.వరకు 4009 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.మరో 14 మంది కరోనాతో మృతి చెందారు.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం(ఏప్రిల్ 19) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.మరో 5104 రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది.తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3, 55,433కి చేరింది.మొత్తం మృతుల సంఖ్య 1838కి చేరింది. ప్రస్తుతం 39,154 యాక్టివ్ కేసులు ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో 1878 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,14,441కి చేరింది.ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.2శాతం ఉం డగా తెలంగాణలో 0.51శాతం ఉంది.జాతీయ స్థాయిలో రికవరీ రేటు 86 శాతం ఉండగా తెలంగాణలో 88.46 శాతం ఉంది.తాజాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 705 కేసులు నమోదయ్యాయి.రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,18,20,842 కరోనా టెస్టులు నిర్వహించారు.దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 2,73,810 కరోనా పా జిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కేసుల సంఖ్య 150,61,919కి చేరింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19,29,329 యాక్టివ్ కేసులు ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో మరో 1,625 మంది కరోనాతో మృతి చెందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here