మానవత్వానికి మతం అడ్డుకాదంటున్న ముస్లిం యువకులు..

కామారెడ్డి:కరోనా మహమ్మారి కారణంగా సొంతవారు కూడా దూరంగా ఉంటున్నారు.కరోనా పోజిటివ్ సోకిందని తెలియగానే రక్త సంబంధీకులు సైతం అంటి ముట్టన ట్టుగా వ్యవహరిస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఏమికానీ పోజిటివ్ మృత దేహానికి అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు ముస్లిం యువకులు. మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటే అని నిరూపించారు.ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలం కాటేపల్లి కి చెంది న మొగులయ్య అనే యువకుడికి కరోనా పోజిటివ్ వచ్చింది. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం బాన్సువాడ ఏరియా ఆస్పత్రి కి తరలించారు.అయితే మొగులయ్య చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందాడు.మొగులయ్యకు కరోనా పాజిటివ్ ఉందని తెలిసి అంతక్రియలకు చేసేందుకు బంధువులు,కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాలేదు.దీంతో విషయం తెలుసుకున్న ఇద్దరు యువకులు ముందుకు వచ్చారు.మతాలు వెరైన మానవత్వంతో షఫి,అలి అనే మైనారిటీ యువ కులు వారి అంబులెన్స్ లో మొగులయ్య మృత దేహాన్ని బాన్సువాడలోని హిందూశ్మశానవాటికకు తీసుకువెళ్లి అంతక్రియలు నిర్వహించారు.కోవిడ్ కారణంగా రక్త సంబంధీకులే దగ్గరకు రావడానికి మొఖం చాటేస్తున్నారు.ఇలాంటి సమయంలో కోవిడ్ పోజిటివ్ మృతుడికి అంత్య క్రియలు చేయడం గర్వించదగ్గ విషయం.మనిషిని మనిషిలా చూడడం వారి గొప్పతనమని స్థానికులు అంటున్నారు.జగిత్యాల జిల్లాలో కూడా కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలను పూర్తి చేస్తూ ఆదర్శంగా నిలిచిన,నిలుస్తున్న ముస్లిం యువకుల సేవలు అభినందనీయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here