హైదరాబాద్:దేశ వ్యాప్తంగా కరోనా పంజా విసురుతుంది,గత కొన్ని రోజులుగా రోజుకు రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.భారీగా మరణాలు సంభవిస్తున్నాయి.సామాన్యుల నుంచి సినీ నటులు,రాజకీయ నేతలు,అధికారులు అందరూ ఈ కరోనా వైరస్ బాధితులుగా మారిపోతున్నారు.ఇప్పటివరకు దేశంలో మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్,గుజరాత్ సీఎం విజయ్ రూపాని,ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్,మేఘాలయ సీఎం కర్నాడ్ సంగ్మా,హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్,కర్ణాటక సీఎం యడ్యూరప్ప,కేరళ సీఎం పినారై విజయం,తమిళనాడు సీఎం పాలని స్వామి లు కరోనా బారిన పడగా తాజాగా తెలంగాణ సీఎం కెసిఆర్ కి కరోనా పాజిటివ్ గా తేలింది.