వామ్మో..జ్యోతిష్యుడే దొంగ..

హైదరాబాద్:హైదరాబాద్లో నకిలీ నోట్ల తయారీ స్కాంలో ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.హైదరాబాదు నగరంలో నకిలీ నోట్లు తయారీ స్కాం వెలుగులో కి వచ్చిన విషయం తెలిసిందే.అయితే ఈ నకిలీ నోట్ల తయారీ స్కాంపై కేసు నమోదు చేసుకున్న ఎల్బీ నగర్ పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.అయితే ఈ కేసులో ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా రూ.17 కోట్ల 70 లక్షల హవాలా మరియు దొంగనోట్ల భారీ స్కాంను పోలీసులు గుట్టు రట్టు చేశారు.ఇందులో గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ఇద్దరు పూజారులతో పాటు మరికొంత మందిని పోలీసులు అరెస్టు చేశారు.వేల్పూర్ పవన్ కుమార్,దొండపాటి రామకృష్ణ,నలబోతుల పోతుల సురేష్ గోపి,చందలూరి విజయ్ కుమార్ (పూజారి),కుంభం పాటి సూర్య,చందలూరి నాగేంద్రప్రసాద్ శర్మ ఈ ఆరుగురు పిడుగురాళ్ల పట్టణానికి చెందిన వారు.(పూజారి) బెల్లం కొండ మురళి కృష్ణ శర్మ(పూజారి) ఇతను మాత్రం రంగారెడ్డి జిల్లాకు చెందిన వాడు.నకిలీ నోట్ల తయారీ చెలామణి విష యంలో పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ఇద్దరు పూజారులతో పాటు మరో నలుగురిని కూడా హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరచనున్నా రు.అయితే పూజారుల ఇంట్లో ఇలాంటి సొమ్ము పట్టుబడడంతో పోలీసులు షాక్ తిన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here