కరీంనగర్‌లో..వ్యభిచార దందా నిర్వాహకులు భార్యాభర్తలే..

కరీంనగర్:కరీంనగర్‌లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఓ వ్యభిచార దందాను పోలీసులు బట్టబయలు చేశారు.పక్కా సమాచారంతో వ్యభిచార స్థావరంపై దా డులు చేసి విటులతో పాటు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంకమ్మతోట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే మాన కొండూరు మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన బొమ్మరవేని సాయికుమార్,అతని భార్య కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంకమ్మతోట ప్రాంతంలో నివాసం ఉంటు న్నారు.విలాస జీవితం గడిపేందుకు వీరు అడ్డదారులు తొక్కారు.కొన్నాళ్లుగా వ్యభిచార దందా నిర్వహిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.వీరు వాట్సాప్ ద్వారా విటు లకు యువతుల ఫోటోలను పంపిస్తారు.గంటకో రేటు చొప్పున వారితో డీల్ మాట్లాడుకుంటారు.ఆపై మంకమ్మతోటలోని తమ ఇంట్లో లేదా నగర శివారులోని కాలనీ ల్లో ఉన్న అపార్ట్‌మెంట్లు,ఇండిపెంట్ హౌస్‌లలో విటులకు ఏర్పాట్లు చేస్తారు.ఇటీవల ఈ వ్యభిచార దందాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగారు.మంకమ్మతోటలోని ఆ దంపతుల ఇంటిపై దాడి చేశారు.దాడుల్లో హుస్నాబాద్‌కి చెందిన రామడుగు అశోక్,చందు,పొన్నం శంకర్ అనే వ్యక్తులు పట్టుబడ్డా రు.వీరి నుంచి రూ.37,380 నగదు,5 సెల్‌ఫోన్లు,10 కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.వీరిపై కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.వ్య భిచార నిర్వాహకులు బొమ్మరవేని సాయికుమార్,అతని భార్యకు ఎవరెవరు ఈ దందాకు సహకరిస్తున్నారో పోలీసులు ఆరా తీస్తున్నారు.వీరి వద్దకు వచ్చే విటుల్లో ప్రముఖ వ్యాపారులు,ప్రభుత్వ ఉద్యోగులు,రాజకీయ నేతలు కూడా ఉన్నట్లు సమాచారం.గోదావరిఖని,జగిత్యాల,వరంగల్‌,హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి యు వతులను తీసుకొచ్చి వారిని అద్దె ఇళ్లల్లో ఉంచి వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here