కోవిడ్ జర్నలిస్టులకు 5 కోట్ల 15 లక్షల సహాయం:మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ

హైదరాబాద్:తెలంగాణ మీడియా అకాడమి తెలంగాణ జర్నలిస్టులకు అందించిన కోవిడ్ ఆర్థిక సహాయం మొత్తం 5 కోట్ల 15 లక్షల రూపాయలు.దేశంలోని ఏ రాష్ట్రం లో లేని విధంగా కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులను తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ మీడియా అకాడమి ఆదుకున్నదని తెలంగాణ రాష్ట్ర మీడియా అకా డమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.కరోనా మహమ్మారి దరిదాపు ఏడాదిన్నర కాలంపాటు జన జీవితాలని ఆతలాకుతలం చేసింది.రాష్టంలోని అన్నిరంగాలను ప్రభావితం చేసిన కరోనా జర్నలిస్టులను కూడా తీవ్రంగా ఇబ్బందులపాలు చేసింది.ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షే మం-శిక్షణ కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి జర్నలిస్టులకు ఎదురైన కరోనా ఇబ్బందులను కొద్ది మేరకైనా తొలగించడానికి ప్రయత్నం చే సింది.అందులో భాగంగా ఇప్పటి వరకు కరోనా సోకిన జర్నలిస్టులకి దరిదాపు 5 కోట్ల 15 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించిందని మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.తొలి విడత కరోనా సమయంలో దరిదాపు 1553 మంది కరోనా సోకిన జర్నలిస్టులకి 3 కోట్ల 10 లక్షల 60 వేల రూపాయలను కరోనాతో హోంక్వారంటైన్‌లో ఉన్న జర్నలిస్టులకు 87 మందికి 8 లక్షల 70 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాము.రెండవ విడత కరోనా తీవ్ర ఉధృతి కేవ లం నాలుగు నెలల వ్యవధిలోనే దాదాపు 1958 మంది జర్నలిస్టులకి కరోనా సోకింది.మలి విడత ఆర్థిక సహాయం 10 వేల వంతున 1958 మంది జర్నలిస్టులకి ఒక కోటి 95 లక్షల 80 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాము.వెరసి మీడియా అకాడమిలో ఉన్న 34 కోట్ల 50 లక్షల కార్పస్ ఫండ్‌తో వచ్చిన వడ్డీ ఆధా రంగా ఈ మొత్తాలను జర్నలిస్టులను ఆదుకోవడానికి అకాడమి వినియోగించింది.తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా కూడా కరోనా సోకిన జర్నలిస్టులకు ఇ లా ఆర్థిక సహాయం అందలేదు.ఇది తెలంగాణ ప్రభుత్వం చేసిన ఒక గొప్ప పనిగా మీడియా అకాడమి భావిస్తున్నది.ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో జర్నలిస్టుల కోసం 100 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశారు.దానిలో ఇప్పటి దాకా ఉన్న 34 కోట్ల 50 లక్షలకు తోడు మరో 7 కోట్ల 50 లక్షల రూపాయలు ఈ కార్పస్ ఫండ్ కి గడిచిన ఏప్రిల్-2021లో సమకూరాయి.దీంతో ఇప్పటి వరకు 42 కోట్లు జర్నలిస్టుల సంక్షేమ నిధికి జమ అయింది.

మరోవైపు 2వ విడత కరోనా తీవ్రత జర్నలిస్టులను చాలా మందిని బలిగొన్నది.పేరు గాంచిన జర్నలిస్టులతో సహా దాదాపు 70 మంది జర్నలిస్టులు ఈ కరోనా మహ మ్మారితో ఆకాల మరణం పొందారు.జర్నలిస్టుల లోకాన్ని తీవ్రంగా కదిలించిన ఈ మరణాలు మీడియా అకాడమిని కుడా కదిలించాయి.అందువలన కోవిడ్ తో మర ణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలని మీడియా అకాడమి నిర్ణయించింది.వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఒక నెల లోపు ఈ రెండు లక్షల ఏక మొత్తం ఆర్థిక సహాయం అందిస్తాము.ఆ కుటుంబాలకు యధావిధిగానే మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఇచ్చిన విధంగానే 5 ఏళ్ల పాటు నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ లభిస్తుంది.అంతేగాక మరణించిన జర్నలిస్టు కుటుంబంలో 10వ తరగతిలోపు చదువుకుంటున్నవారిలో గరిష్టంగా ఇ ద్దరికి ఒక వేయి రూపాయల చొప్పున ఉపకార వేతనం అందుతుంది.కోవిడ్ సమయంలో మిగతా కార్యకలాపాలన్నీ స్థంభించి పోయిన తరుణంలో జర్నలిస్టులను ఆ దుకోవడమే తక్షణ కర్తవ్యంగా మీడియా అకాడమి పని చేసింది. తక్కువ మంది సిబ్బంది ఉన్నప్పటికీ కేవలం వాట్సాప్ ద్వారా పంపిన 3600ల కోవిడ్ సహాయ దర ఖాస్తులను పరిష్కరించిన మీడియా అకాడమి సిబ్బంది కరోనా సంక్షోభ సమయంలో చేసిన కృషి ప్రశంసనీయం.త్వరలో మీడియా అకాడమి తరుఫున జర్నలిస్టులకు శిక్షణా తరగతులు,ఇతర కార్యక్రమాలు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.కోవిడ్ సోకి మరణించిన జర్నలిస్టుల కుటుంబాల వారు పూర్తి చేసిన దరఖాస్తులను కార్యద ర్శి,తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి,హైదరాబాద్ చిరునామా:ఇంటినెం.10-2-1,సమాచార భవన్,2వ అంతస్తు,ఎ.సి. గార్డ్స్,మాసాబ్ ట్యాంక్,తెలంగాణ రాష్ట్ర చ లన చిత్ర అభివృద్ది సంస్థ కాంప్లెక్స్,హైదరాబాద్ కు పంపవలసిందిగా మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here