ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్..విజేత న్యూజిలాండ్ ‌

సౌతాంప్టన్‌:ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా న్యూజిల్యాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచులో భారత్ ఓటమిపాలైంది.మరో 43 బంతులు మిగిలుండగానే ఎనిమిది వికెట్ల తేడాతో విలియమ్సన్ సేన విజయఢంకా మోగించింది.ఈ విజయంతో తొలి టెస్టు ఛాంపియన్‌షిప్ విజేతలుగా కివీస్ జట్టు నిలిచింది.ఈ విజయంలో న్యూజిల్యాం డ్ కెప్టెన్ విలియమ్సన్ కీలక పాత్ర పోషించాడు.రెండో ఇన్నింగ్సులో కేవలం 89 బంతుల్లోనే 52 పరుగులు చేసి జట్టుకు విజయాన్నందించాడు.తొలి ఇన్నింగ్సులో భారత జట్టు 217 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత న్యూజిల్యాండ్ జట్టు 249 పరుగులు చేసింది.రెండో ఇన్నింగ్సులో భారత బ్యాటింగ్ లైన ప్ తడబడింది.వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ (88 బంతుల్లో 41) మాత్రమే ఫర్వాలేదనిపించాడు.మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ విఫలం అవడంతో కోహ్లీ సేన వికెట్లన్నీ కోల్పోయి కేవలం 170 పరుగులు మాత్రమే చేయగలిగింది.కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ 4,ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు తీయగా కైల్ జేమీసన్ 2,నీల్ వాగ్నర్ 1 వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు మరో 43 బంతులు మిగిలుండగానే రెండు వికెట్లు కోల్పోయి 140 పరుగు లు చేసింది.విలియమ్సన్‌తోపాటు సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ (47) న్యూజిల్యాండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.రెండో ఇన్నింగ్సులో న్యూజిల్యాండ్ జట్టు కోల్పోయిన రెండు వికెట్లూ అశ్విన్ కూల్చినవే కావడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here