శరర రక్తహీనత కు కారణాలు ఇవే..

గోదావరిఖని:మన శరీరానికి రక్తం ఎంతో అవసరం అది ప్రాణ శక్తినిస్తుంది.శరీరంలోని అన్ని జీవ కణాలకు కావాల్సినంత జీవావయువు మరియు పోషకాలను అందిం చడమే కాక రోగనిరోధక వ్యవస్థలో భాగమైన తెల్ల రక్త కణాలు,మాక్రోఫేజెస్‌,యాంటీ బాడీస్‌ మొదలైనవన్నీ రక్తం ద్వారానే శరీరమంతా చేరుతాయి.మన రక్తంలోని ఎ ర్రరక్త కణాలు ఆరోగ్యంగా లేక పోతే రక్తహీనత వచ్చే అవకాశం ఉంది.దీనినే అనీమియా అంటారు.దీనికి ప్రధాన కారణం ఐరన్‌ లోపం.ఐరన్‌ బాగా తక్కువగా ఉన్న ప్పుడు కేవలం ఆహారంలో మార్పులతో దానిని పెంచడం సాధ్యం కాదు.మందులు లేదా సప్లిమెంట్లు వాడాలి.అయితే మందులతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీ సుకుంటే ఐరన్‌ బలపడేలా చూసుకోవచ్చు.మాంసం తినాలి అనేసి అనుకొనే వాళ్ళు కోడి చేప లాంటివి వారానికి కనీసం మూడుసార్లు తీసుకుంటే తగినంత ఐరన్‌ లభిస్తుంది.శాకాహారులైతే అన్నిరకాల పప్పులు,నల్ల శనగలు,అలసందలు,ఉలవలు,సోయాబీన్స్‌,చిక్కుళ్లు మొదలైనవి రోజూ తీసుకోవాలి.తోటకూర,పాలకూర,గోం గూర తప్పనిసరి.మీరు ఐరన్‌ సప్లిమెంటు తీసుకుంటున్నట్లయితే వాటిని ఉదయాన్నే ఏం తినని ముందు వేసుకోవాలి.నిమ్మ,నారింజ లాంటి విటమిన్‌-సి అధికంగా ఉన్న పండ్లు,రసాలను తీసుకుంటే మందులలోని ఐరన్‌ను శరీరం పూర్తిగా పీల్చుకోగలుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here