హైదరాబాద్:యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో మరియమ్మ మృతిపై కాంగ్రెస్ నేతలతో భేటీ అనంతరం సీఎం కేసీఆర్ స్పందించారు.ఎస్సీ మహిళ లాకప్ డెత్ అత్యంత బాధాకరమన్నారు.మరియమ్మ లాకప్‌డెత్ ఘటనలో పోలీసుల తీరుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మరియమ్మ మృతిపై విచారణకు ఆదేశించిన సీ ఎం నిజనిర్ధారణ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎస్సీలు పేదల పట్ల పోలీసుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలన్నారు.ఎస్సీల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదని వారికి అన్యాయం జరిగితే తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు.ఇలాంటి ఘటనలు ప్రభుత్వం సహించబోదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్‌కు రూ.15 లక్షల పరిహారం ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నివాస గృహం మంజూరు చేస్తామన్నా రు.మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...