రాత్రి పూట అన్నం తింటే మంచిదా.? చపాతి తింటే మంచిదా.?

వరంగల్:చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే రాత్రి పూట అన్నం తింటే మంచిదా?లేక చపాతీ తింటే మంచిదా.? అనే ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది.అలాగే రాత్రి సమ యంలో కొంత మంది రైస్ తీసుకుంటే మరి కొందరు మాత్రం చపాతీ తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు.అసలు ఏది తింటే మంచిదో తెలుసుకుందాం.చపాతీలతో పో ల్చి చూస్తే బియ్యంలో ఫైబర్,ప్రోటీన్స్,కొవ్వులు తక్కువగా ఉంటాయి.అలాగే కేలరీలు మాత్రం ఎక్కువగా ఉంటాయి.రాత్రి.పూట అన్నం తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది.అదే చపాతీ,రోటీలలో ఫైబర్,ప్రాథినియెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి తింటే త్వరగా ఆకలి వేయదు.అయితే చపాతీ,రోటీలలో కాల్షియం,మెగ్నీషియం, భాస్వరం,సోడియం ఎక్కువగా ఉంటాయి.అందుకనే బరువు తగ్గాలని భావించే వాళ్లు భోజనంలో చపాతీని చేర్చుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.నిపు ణుల సలహాలు,సూచనల ప్రకారం రాత్రి సమయంలో రైస్ బదులు చపాతీ తింటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది.చపాతీ తింటే వేడి చేస్తుంది అని భావించే వా ళ్ళు శరీరం చల్లదనంగా ఉండడానికీ చల్లటి పానీయాలు తాగితే పోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here