హైదరాబాద్:తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియమితులయ్యారు.కార్యనిర్వాహక అధ్యక్షులుగా అజారుద్దీన్,గీతారెడ్డి,ఎం.అంజన్‌కు మార్ యాదవ్,టి.జగ్గారెడ్డి,బి.మహేశ్‌కుమార్ గౌడ్‌లను కాంగ్రెస్ అధిష్ఠానం ఫైనల్ చేసింది.సీనియర్ ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్ సంబని,దామోదర్‌రెడ్డి,రవి మల్లు, పొడెం వీరయ్య,సురేశ్ షెట్కార్,వేం నరేందర్‌రెడ్డి,రమేశ్ ముదిరాజ్,గోపిశెట్టి నిరంజన్,టి.కుమార్ రావు,జావేద్ ఆమీర్‌లను నియమించింది.ప్రచార కమిటీకి ఛైర్మన్‌గా మధు యాస్కీ గౌడ్,కన్వీనర్‌గా సయ్యద్ అజమ్‌తుల్లా హుస్సేనీ,ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా దామోదర్ సి.రాజ నర్సింహ,ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా ఆలేటి మహేశ్వరరెడ్డి నియమితులయ్యారు.తమకే పీసీపీ పగ్గాలు కావాలంటూ చాలామంది రకాల ప్రయత్నాలు జరిగినా రేవంత్ ఢిల్లీ కేంద్రంగా తన మార్క్ ప్రయత్నాలు చేశారు.చివరి వరకు రేవంత్ రెడ్డికి పోటీగా ముగ్గురు పేర్లు రేసులో ఉన్నాయి.అందులో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ మాత్రమే సమర్ధుడనే క్యాడర్‌తో పాటు పలువురు నేతల నుంచి సంకేతా లు ఢిల్లీ అధినాయకత్వానికి వెళ్లాయని సమాచారం.ఈ క్రమంలో రేవంత్ వైపే కాంగ్రెస్ పెద్దలు మొగ్గు చూపారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...