మొలకెత్తిన గింజలతో మీ ఆరోగ్యం పదిలం..

గోదావరిఖని:మొలకలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.మరి ఈ మొలకలను ప్రతి రోజు ఆహారంలో భాగంగా తినడం వలన కలిగే ఉపయోగాలు ఏంటో చూద్దామా.మొలకలను మీ డైట్ లో యాడ్ చేసుకుంటే మీ కడుపు శుభ్రంగా ఉంటుంది మరియు మీరు ఆరోగ్యం గా ఉండడానికి కూడా వీలవుతుంది.మొలకలను ప్రతి రోజు తింటూ ఉంటుంటే బరువు సులభంగా తగ్గుతారు.మన డైట్ లో మంచి నాణ్యత ఉన్న పండ్లు,కూరగాయ లు,నట్స్ మరియు గింజలు తీసుకోవడం మంచిది.వీటి కారణంగా బరువు తగ్గడానికి వీలవుతుంది.కాబట్టి వీటిని తీసుకోవడం మంచిది కేవలం న్యూట్రియన్స్ మాత్ర మే కాకుండా దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.మీరు కావాలంటే వీటిని స్నాక్స్ రూపం లో కూడా తీసుకోవచ్చు.క్యాలరీలు తక్కువగా ఉండే ఈ మొలకలు తి నడం వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ మనం పొందొచ్చు పైగా వీటి లో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.ఇవి తినడం వలన ఆకలి కూడా తగ్గుతుంది.ముఖ్యంగా పెసలు, మెంతులు బరువు తగ్గడానికి బాగా ఉపయోగ పడతాయి కనుక మీరు మీ డైట్ లో పెసలని తీసుకోండి.దీంతో బరువు తగ్గడానికి కూడా వీలవుతుంది.ఈ మొలకల్లో విటమిన్స్ మరియు మినిరల్స్ ఉంటాయి.అలానే ఐరన్ కాపర్ మాంగనీస్ పొటాషియం కూడా సమృద్ధిగా ఉంటాయి.ఇలా మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల విట మిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి.ఇది వైట్ బ్లడ్ సెల్స్ కి కూడా మంచి సహాయం చేస్తాయి.ఇమ్యూన్ సిస్టమ్ ని కూడా పెంచుకోవడానికి వీలవు తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here