హైదరాబాద్:ఇకపై ప్రజా సమస్యలు తీర్చేందుకు 24గంటలు అందుబాటులో ఉంటానని,తనను రాజకీయాల్లోకి లాగొద్దని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై రాజకీయపరమైన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని ఆయన అన్నారు.భువనగిరి,నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామంలో పర్యటిస్తానని,అక్కడి సమస్యలను తెలుసుకొని పరిష్కారం దిశగా ముందుకెళ్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడి నిధులు తీ సుకొచ్చే ప్రయత్నం చేస్తానన్నారు.ఎస్సెల్బీసీ ప్రాజెక్ట్ జాప్యంతో వేలాది ఎకరాలు బీడు వారుతోందని,ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువ స్తానని అన్నారు.