ఇక సులభం..స్కానర్లతో కరోనా వైరస్ గుర్తింపు

న్యూఢిల్లీ:కరోనా వైరస్‌ను గుర్తించేందుకు రకరకాల పరీక్షలు అందుబాటులోకి వస్తున్నాయి.వైరస్ సోకిన వారిని వీలైనంత త్వరగా గుర్తించే విధానాలను అందుబాటు లోకి తీసుకువస్తున్నాయి పలు దేశాలు.ఇందులో భాగంగా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నవారిని సులభంగా గుర్తించే సాంకేతికతను అబుదాబి అందుబాటులోకి తీసుకువ చ్చింది.ముఖ్యంగా రద్దీ ప్రదేశాలైన విమానాశ్రయాలు,మాల్స్‌లో ఫేషియల్‌ స్కానర్లతో వైరస్‌ సోకినవారిని గుర్తించేందుకు ఏర్పాట్లు చేసింది ఆరోగ్యశాఖ.వేల మందిపై జరిపిన పరిశోధనలో దాదాపు 90 శాతానికి పైగా కచ్చితత్వంతో ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారిని స్కానర్లు గుర్తిస్తున్నాయని అబుదాబి ఆరోగ్యశాఖ తెలిపింది.కరోనా మహ మ్మారిని అరికట్టడంలో ముందుగా వైరస్‌ సోకిన వారిని గుర్తించడమే అత్యంత కీలకం.ఇందు కోసం ఇప్పటికే ఆర్‌టీ-పీసీఆర్‌ (RT-PCR)తో పాటు అత్యంత వేగంగా ఫలితాలను ఇచ్చే కోవిడ్‌ యాంటీజెన్‌ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు.వీటికంటే మరింత వేగంగా వైరస్ సోకిన వారిని గుర్తించేందుకు అబుదాబి ఆరోగ్య శాఖ అధి కారులు ఈ కొత్త టెక్నాలజీని వినియోగించారు.ఇందు కోసం వ్యక్తి శరీరంపై కరోనా వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ కణాలను గుర్తించే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్‌ వేవ్స్‌ సాంకేతికతను వినియో గించారు.అబుదాబికి చెందిన ఈడీఈ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీని ప్రయోగాల్లో భాగంగా 20వేల మందిపై పరీక్షించారు.ఇందులో వైరస్‌ ఉన్న వారిని 93 శాతం స్కానర్లు గుర్తించినట్లు అబుదాబి ఆరోగ్యశాఖ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here