ఇంటికి నిప్పు పెట్టిన ఎలుక!

పశ్చిమ గోదావరి:అగ్నిప్రమాదానికి ఐదు పూరిళ్లు కాలి బూడిదయ్యాయి.ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి సమీపంలోని గురకల పేట లో జరిగింది.కూలీలు రోజు పనులకు వెళ్లేముందు ఇంట్లో దీపం వెలిగించి వెళ్తారు.అయితే ఆ దీపం కిందపడటంతో మంటలు వ్యాపించాయి.మంటలు పక్కన ఇంటికి తాకాయి దీంతో పక్కింట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిపోయి మంటలు పెద్దగా వ్యాపించాయి.చుట్టూ ఉన్న ఐదు ఇల్లు కాలి బూడిదయ్యాయి.స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.ఉరదళ సుబ్బారావు,అనిక దశరథ,పి.తులసి,కెల్లా అప్పలనాయుడు,కెల్లా శాంత ఇళ్లు దగ్ధమయ్యాయి.ఆస్తి నష్టం సుమారు రూ.5 లక్షలు ఉంటుందని అంచనా ఈ ఘటనకు ఎలుకే కారణమని అధికారులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here