తప్పు చేశావు రాందేవ్..సారీ చెప్పు:హర్షవర్ధన్

న్యూఢిల్లీ:అల్లోపతి వైద్యంపై ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.కరోనా కంటే అల్లోపతి వంటి ఆధునిక చికిత్స వై ద్య విధానాలే ప్రజలను బలిగొంటున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలు వైద్యుల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని రామ్ దేవ్ బాబా కు లీగ్‌ల్ నోటీసులు పంపాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) కోరింది.రాందేవ్ వివరణ ఇస్తే సరిపోదని తన వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకోవా ల్సిందేనని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు.తక్షణమే రామ్ దేవ్ బాబా లిఖితపూర్వక క్షమాపణ తో పాటు మరియు వ్యాఖ్యలను ఉపసంహ రించుకోవాలని కోరుతూ డా.హర్షవర్ధన్ ఖరాశారు.కరోనా మహమ్మారి సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్న వైద్యులపై చేసిన ప్రకటన క రోనా యోధులను అగౌరవపరిచిందని దేశ మనోభావాలను దెబ్బతీసిందని లేఖలో పేర్కొన్నారు.అల్లోపతికి వ్యతిరేకంగా రామ్‌దేవ్ చేసిన ప్రకటనపై విచారం వ్యక్తం చేసి న కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here