దళిత యువకుడిపై పోలీసుల ప్రతాపం,మూత్రం తాగించి..

బెంగుళూర్:అణగారిన వర్గాలు అంటే సమాజంలో చిన్న చూపే ఇక పోలీసుల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.బలమైన సామాజిక వర్గం వారు ఏదీ చెబితే అదే జరు గుతుంది.కర్ణాటక చిక్ మంగళూర్ జిల్లాలో అలాంటి ఘటన జరిగింది.ఓ యువకుడిపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు.గోనిబీడు పోలీస్ స్టేషన్ పరిధిలో పునీత్ అనే యువకుడు ఉంటున్నాడు.అతను ఓ మహిళతో తరచుగా మాట్లాడుతున్నాడు అనే ఆరోపణలు వచ్చాయి.దీనిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇంకే ముంది పోలీసులు పీఎస్‌కు తీసుకొచ్చారు.నరకం అంటే ఏంటో అతనికి చూపించారు.కాళ్లు చేతులు కట్టేసి కొట్టారు.దాహం వేస్తుందని అడిగిన పాపానికి యూరిన్ పో శారు.నేలపై ఉన్న అదీ నాకాలని బెదిరించారు.అలా చేయకుంటే వదిలిపెట్టమని హెచ్చరించారు.తనను కులం పేరుతో కూడా దూషించారని చెప్పారు.ఈ నెల 10వ తేదీన ఈ ఘటన జరగగా అతను డీజీపీకి ఫిర్యాదు చేశాడు.ఘటనపై చిక్ మంగళూర్ డీఎస్పీ స్పందించారు.దర్యాప్తు జరుగుతుందని ఎస్సైని ట్రాన్స్ ఫర్ చేశామని వివరించారు.ఈ ఘటనపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి.సదరు ఖాకీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here