మినుములు తింటే..ఎంత మంచిదంటే..?

కరీంనగర్:మనం ఆరోగ్యవంతంగా ఉండేందుకు అనేక రకాల తృణ ధాన్యాలు పోషకాలు అందిస్తాయి.అలాంటి వాటిల్లో మినుములు ఒకటి.సాధారణంగా చాలామంది మినుములు తింటే ఇనుము అంత బలం చేకూరుతుంది.అంటూ చెబుతుంటారు.ఆ నానుడి ప్రకారం మినుముల్లోని పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతోపాటు అనేక రోగాల నుంచి కాపాడతాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మినుములు జీర్ణక్రియకు మెరుగుపరిచి బలాన్ని చేకూరుస్తాయి.చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.వంద గ్రాముల మినుముల్లో 18 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది.ఒక గ్రాము పొటాషియం రెండు గ్రాముల కొవ్వు ఉంటుంది.దీంతో పాటు విట మిన్ సీ,విటమిన్ బీ-కాంప్లెక్స్‌లోని బీ1,బీ3 తోపాటు కాల్షియం,మెగ్నిషియం ఐరన్ వంటివి కూడా పుష్కలంగా ఉంటాయి.జీర్ణక్రియ..మినుములను నిత్యం ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తే జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది.మినుముల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కావున ఎవరైనా జీర్ణసమస్యలతో బాధపడుతుంటే మి నుములను ఆహారంలో చేర్చితే ప్రయోజనం కలుగుతుంది.దీంతోపాటు మలబద్దకం,ఉబ్బసం లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి.డయాబెటిస్‌..రక్తహీనత మిను ముల్లో ఉండే పోషకాలు ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తాయి.ఇవి రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడతాయి.మినుముల వల్ల చక్కెర స్థాయి అదుపులో ఉంటుం ది.ఇన్సులిన్,గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేసి డయాబెటిస్ సమస్య తలెత్తకుండా మినుములు సహకరిస్తాయి.అంతేకాకుండా రక్తహీనత సమస్యను కూడా ని వారిస్తాయి.ఎముకలు..మినుముల్లో కాల్షియం,భాస్వరం,పొటాషియం,ఐరన్,మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉన్నాయి.ఇవన్నీ ఎముకలు బలంగా,ధృఢంగా మార డానికి దోహదపడతాయి.కావున ఎముకలు విరిగిన వారు,కీళ్లవాతం,ఆర్థటైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారు మినుములను తినడం మంచింది.మంటను తగ్గి స్తాయి..మినుముల్లో మంటను తగ్గించే యాంటీ-ఇన్‌ప్లమేటరీ గుణం ఉంది.గాయాలు,నొప్పులతో బాధపడుతున్న వారికి మినుములతో తయారు చేసిన ఆహారం వడ్డి స్తే మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.అంతేకాకుండా వీటిలోని పోషకాల వల్ల చర్మ సౌందర్యం కూడా బాగా పెరుగుతుంది.గుండెకు రక్షణ..మినుముల్లో గుండె జబ్బులను నివారించే అద్బుతమైన గుణం ఉంది.ఇందుకు మినుముల్లో పుష్కలంగా ఉన్న పొటాషియం,పీచుపదార్థాలే కారణమని పరిశోధనల్లో తేలింది.అవి రక్తంలో వెలువడే చక్కెర,చెడు కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తాయి.పొటాషియం వల్ల రక్తపోటు తగ్గుతుంది.రక్త ప్రసరణ మంచిగా జరగడం వల్ల హృదయ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here