ఢిల్లీ సరిహద్దుకు భారీగా తరలిన రైతులు..

న్యూఢిల్లీ:నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మే 26న బ్లాక్​ డే పేరిట దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా తలపెట్టిన నిరసనలకు 12 ప్రధాన విపక్ష పార్టీ లు మద్దతు ప్రకటించాయి.ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.కాగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమానికి 6 నెలలు పూర్తికానున్న సందర్భంగా ఎస్​కేఎం ఈ కార్యక్రమం నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.ఈ సంయుక్త ప్రకటనపై సోనియా గాంధీ(కాంగ్రెస్),హెచ్ డీ దేవెగౌడ (జేడీఎస్),శరద్ పవార్(ఎన్​సీపీ),మమతా బెనర్జీ(టీఎంసీ),ఉద్దవ్ ఠాక్రే(శివసేన),ఎం కే స్టాలిన్(డీఎంకే),అఖిలేష్ యాదవ్(ఎస్పీ),తేజస్వీయాదవ్(ఆర్జేడీ),హేమంత్ సోరెన్(జేఎంఎం),ఫరూక్ అబ్దుల్లా(జేకేపీఏ),డీ రాజా(సీపీఐ),సీతారాం ఏచూరి(సీపీఐ-ఎం)సంతకం చేశారు.లక్షలాది మంది మన అన్నదాతలు కరోనా బాధితులు కాకుండా రక్షించాలని వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తద్వారా వారు భారతీయ ప్రజలకు ఆహారం ఇవ్వడానికి ఆహారాన్ని ఉత్పత్తి చేయడాన్ని కొనసాగించేం దుకు వీలుంటుందని ఉమ్మడి ప్రకటనలో విపక్షాలు పేర్కొన్నాయి.ప్రభుత్వం రైతులను వెంటనే చర్చలకు ఆహ్వానించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.స్వామినా థన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలని విపక్షాలు లేఖలో పేర్కొన్నాయి.కాగా మూడు వ్యవసాయ చట్టాలపై చర్చలు తిరిగి ప్రా రంభించాలని విజ్ఞప్తి చేస్తూ 40కి పైగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలకు నేతృత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.మరోవైపు,ఢిల్లీలోకరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నందున సాగు చట్టాలపై ఆందోళనలు తీవ్రతరం చేసేందుకు రైతులు సమాయ త్తం అవుతున్నారు.హర్యాణా గ్రామీణ ప్రాంత రైతులు భారీగా టిక్రీ సరిహద్దు వద్దకు తరలివస్తున్నారు.హరియాణాలోని కర్నాల్​ నుంచి వేలాది వాహనాలతో ఢిల్లీకి వ స్తున్నాం.ప్రతి వారం ఒక్కో జిల్లా నుంచి రైతులను దీక్షాస్థలి వద్దకు తీసుకొచ్చి ఉద్యమాన్ని కొనసాగిస్తాం అని భారతీయ కిసాన్​ యూనియన్​ హరియాణా విభాగం అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here