టెన్షన్..టెన్షన్..వాయువేగంతో దూసుకువస్తున్న యాస్..

భువనేశ్వర్:ఒక తుఫాన్‌ నుంచి కోలుకోకముందే మరో రాకాసి తుఫాన్ దూసుకువస్తోంది.తౌక్టే తుఫాన్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా తాజాగా యాస్‌ తు ఫాన్‌ అలజడి రేపుతోంది.తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది.ఇది బుధవారం ఉదయం అతి తీవ్ర తుఫాన్‌గా మారి ప శ్చిమ బెంగాల్‌ ఉత్తర ఒడిశా తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం పేర్కొంది.ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న వా యుగుండం తీవ్ర తుఫాన్‌గా మారుతుందని ఆ తర్వాత 24 గంటల్లో అతి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని ఐఎండీ హెచ్చరించింది.ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్‌ మ ధ్యలో గల పారాదీప్‌ సాగర్‌ దీవుల ప్రాంతాన్ని యాస్‌ తుఫాను 26న సాయంత్రం తాకే అవకాశమందని వివరించింది.’యాస్‌’తీరాన్ని తాకే సమయంలో గంటకు 155-165 కిలోమీటర్ల నుంచి 185 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు అంచనా వేశారు.దీంతోపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురు స్తాయని అధికారులు హెచ్చరించారు.యాస్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రధాని నరేంద్రమోదీ అధికారులను ఆదేశించా రు.’యాస్‌’తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఆర్‌ఎఫ్‌)ఆర్మీ ఇతర విభాగాల ఉన్నతాధికారులతో మోదీ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.విద్యుత్‌ కమ్యూనికేషన్‌ సమస్యలను వెంటనే పునరుద్ధరించేలా ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించా రు.కోవిడ్‌-19 రోగులకు చికిత్స వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.యాస్ తుఫాను నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ఇప్ప టికే సిబ్బందిని మోహరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here