భూపాలపల్లి:కరోనా తో మృతి చెందిన వృద్ధుడి అంత్యక్రియలు చేసిన భూపాలపల్లి ముస్లిం సేవా సమితి.భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామంలో కరోనాతో మృతి చెందిన వృద్ధుడు జమ్మికుంట లోని ఒక ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందిన వ్యక్తిని పెద్దంపల్లి గ్రామం లోని తన సొంత ఇంటికి తీసుకురాగా దహన సంస్కారాలకు ఎవరు ముందుకు ఎవరు రాలేదు.ఈ విషయం తెలుసుకున్న భూపాలపల్లి ముస్లిం సేవా సమితి సభ్యులు ముందుకు వచ్చి హిందూ సాంప్రదాయ ప్రకారంగా కోవిడ్ ని బంధనలు పాటించి దహన సంస్కారాలు నిర్వహించారు.ముస్లిం సేవా సమితి అధ్యక్షులు సాధిక్ ఉపా ధ్యక్షులు వలీపాషా ట్రెజరర్ జుబేర్ జాయింట్ సెక్రెటరీ జహంగీర్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బాబుమియా అడ్వైజర్ రుక్నుద్దీన్ వలి హైదర్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో ఆప్షన్ ఫోరం అధ్యక్షులు మొహమ్మద్ రాజ్ మొహమ్మద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సేవా సమితి సభ్యులు చేస్తున్న సేవ వెల కట్టలేనిదని ఇకముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయుటకు ముస్లిం సేవా సంస్థ ముందుంటుందని ఆయన తెలిపారు.