మారువేషంలో పోలీసు అధికారి ఏమిచేశాడంటే..?

సిద్దిపేట:లాక్డౌన్ లో పోలీసుల పని తీరును పరిశీలించేందుకు ఓ పోలీసు అధికారి తలకు రుమాలు,సాధారణ దుస్తుల్లో ఓ వ్యక్తి పాత బైకుపై సిద్దిపేట లో దూకుడుగా వెళ్లాడు.10 పోలీసు చెక్‌పోస్టులను దాటేశాడు.ఎక్క డికి వెళ్తున్నావ్‌’ అంటూ పోలీసులు దబాయించగా మెకానిక్‌నని ఓచోట,మెడికల్‌ షాప్‌కి వెళ్తున్నానంటూ మరో చోట బదులిచ్చాడు.మంత్రి నాకు తెలుసు కావాలంటే పీఏకి ఫోన్‌ చేసి మాట్లాడంటూ ఓ చెక్‌పోస్టువద్ద దర్పం ప్రదర్శిస్తే పోలీసులు నిరాకరించారు.‘జ్వరం మాత్రలూ తెచ్చుకోనివ్వరా’ అని ఓ చోట ప్రశ్నిస్తే ఎస్‌ఐ స్థాయి అధికారి గర్జించాడు.ఇదంతా చదివి ఏమనుకుంటున్నారు? అత్యవసర పని ఉన్న ఆ వ్యక్తి ఏదోలా గమ్యం చేరడా నికి పోలీసులకు సాకులు చెబుతున్నారనుకుంటున్నారా..? అయితే అది పొరపాటే సిద్దిపేటలో లాక్‌డౌన్‌ అమలు,ప్రజల పట్ల పోలీసుల తీరు తెన్నులు ఎలా ఉన్నా యో తెలుసు కోవడానికి అదనపు ఎస్పీ రామేశ్వర్‌ ఇలా సాధారణ పౌరుడి అవతార మెత్తారు.అమలు తీరు పై సంతృప్తి వ్యక్తం చేశారు.తిరుగు పయనంలో రుమాలు లేకుండా వచ్చిన అదనపు ఎస్పీని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here