టీ-20 సిరీస్ శ్రీ లంక వశం

కొలంబో:శ్రీలంక రాజధాని కొలంబోలో గురువారం జరిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక అలవోకగా విజయం సాధించింది.82 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 33 బంతులు మిగిలి ఉండగానే విజయ తీరాలకు చేరుకున్నది.మూడు వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలో 82 పరుగులు చేసింది.తద్వారా 2-1 తేడా తో టీ-20 సిరీస్‌ను శ్రీలంక కైవసం చేసుకున్నది.లంకేయులు బౌలింగ్‌లో టీమ్ ఇండియాను పూర్తిగా కట్టడి చేశారు.టీం ఇండియాను 20 ఓవర్లలో 81 పరుగులకు పరిమితం చేశారు.వానిందు హసరంగ తన బౌలింగ్‌లో టీం ఇండియాకు చెందిన నాలుగు వికెట్లు చే జిక్కించుకున్నారు.గమ్మత్తేమిటంటే హసరంగ బర్త్‌డే ఈ రోజు కావ డం గమనార్హం.టీం ఇండియాతో ఆడిన టీ-20 మ్యాచ్‌ల్లో తొమ్మిది పరుగులకే హసరంగ నాలుగు వికెట్లు తీసుకున్నారు.మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌,మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ‌గా హసరంగ ఎంపికయ్యాడు.రెండు జట్ల మధ్య హసరంగది రెండో బెస్ట్ బౌలింగ్‌గా నిలిచింది.ఎనిమిది వికెట్లు కోల్పోయిన టీం ఇండియా కేవలం 81 పరుగులు చేయ డం దాని చరిత్రలో మూడో అతి తక్కవ స్కోర్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here