జమ్మికుంట:మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అస్వ స్థతకు గురవ్వడంతో ప్రజాదీవెన యాత్ర కు తాత్కాలిక విరామం ప్రకటించారు.ఈరోజు యాత్ర 12 వ రోజులో భాగంగా వీణవంక మండలం కొండపాక గ్రామానికి చేరుకున్న తరువాత ఈటల అస్వస్థతకు గురయ్యారు.నడవలేని స్థితిలో ఉండడంతో పాదయాత్రను కొండపాక లో నిలిపివేశా రు.వైద్యులను పిలిపించి పరీక్షలు చేయగా బీపీ 90/60,షుగర్ లెవెల్ 265 గా నమోదు అయ్యింది,ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోవడంతో వెంటనే పాదయాత్రను నిలిపివేసి హైదరాబాద్ తీసుకొని వెళ్ళాలనే డాక్టర్స్ సలహా మేరకు ఈటలను హైదరాబాద్ కి తరలించడానికి ఏర్పాటు చేయగా హైదరాబాద్ వెళ్ళడానికి సుముఖత చూపని ఈటల.హుజురాబాద్ నివాసానికి చేరుకున్న ఈటల.డాక్టర్స్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న ఈటల రాజేందర్.ఈ నెల 19 వ తేదీన మొదలైన ప్రజా దీవెన యాత్ర ఈరోజుకి 12 వ రోజు.ఇప్ప టి వరకు 70 గ్రామాల్లో 222 కిలో మీటర్లు పూర్తి అయ్యింది.