రాష్ట్రంలో 45 శాతం ఇతర రాష్ట్రాల పేషేంట్లే..అందుకే:ఆరోగ్యశాఖ సంచాలకులు

హైదరాబాద్‌:వేల మంది ఇతర రాష్ట్రాల రోగులకు వైద్యం అందించామని ఏ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టాలని తాము అనుకోవట్లేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సం చాలకులు శ్రీనివాసరావు అన్నారు.ఏపీతో సహా ఇతర రాష్ట్రాల నుంచి చికిత్స కోసం హైదరాబాద్‌ వచ్చే రోగులను సరిహద్దులోనే ఆపివేయడంపై తీవ్ర విమర్శలు వస్తు న్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో విధిలేని పరిస్థితుల్లో లాక్ డౌన్ పెట్టాల్సి వచ్చింది.అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ చేస్తున్నారు.అయితే మన రాష్ట్రంలో 45 శాతం మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషేంట్లు ఉన్నారు అని వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాస్ రావు అన్నారు.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంబులెన్సు ల్లో వస్తున్న వాళ్ళు హై ఇన్ఫెక్షన్ లో ఉన్నారు.ఇక్కడ బెడ్ లేక చాలా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.సీఎస్ ముందే అన్ని రాష్ట్రాల సీఎస్ లకు లేఖ రాశారు. ఒక్క ఏపీ మాత్రమే కాదు సరిహద్దు రాష్ట్రాలన్నిoటికీ వర్తిస్తుంది.కాబట్టి ఇక్కడ బెడ్ కన్ఫర్మ్ ఉంటే రావటమే బెటర్ అని తెలిపారు.17 జిల్లాలతో తెలంగాణా ఇతర రా ష్ట్రాలతో సరిహద్దు ఉంది.ఇక్కడ బెడ్ లేకుండా వచ్చి ఇబ్బంది పడతారని ఇటువంటి నిర్ణయం తీసుకున్నాం అంబులెన్సులు అడ్డుకోవడం లేదు.సిస్టం ను ఫాలో కా వాలి అంటున్నాం అని పేర్కొన్నారు.బెడ్ లేకుండా వచ్చి ఎవరూ ఇబ్బంది పడటం సరికాదు.రాష్ట్రంలో ఉన్న 15-20 పెద్ద ఆస్పత్రుల్లోనే అందరికీ బెడ్స్‌ కావాలి.అం దుకోసం మేము లైవ్‌ డాష్‌ బోర్డ్‌ తీసుకొచ్చాం.పెషెంట్‌ ఏదైనా ఆస్పత్రికి వెళ్లడానికి ముందు రోగి పరిస్థితిని బట్టి నోడల్‌ ఆఫీసర్‌ ఆస్పత్రిలో మాట్లాడి అనుమతి ఇస్తా రు.అప్పుడు వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందవచ్చు.అలా కాకుండా బెడ్స్‌ కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.హైకోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని ఎ ప్పటికప్పుడు పడకల వివరాలను లైవ్‌లో అప్‌డేట్‌ చేసుకుంటూ వెళ్తున్నాం.నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం.దీనికి ఇతర రాష్ట్రాల అధికారులు సహకరించాలి.నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకూ 5-7మందికి అనుమతి ఇచ్చాను.దరఖాస్తు చేసుకున్న కొన్ని నిమిషాలు గంటల్లోనే అ నుమతి ఇస్తున్నామని శ్రీనివాసరావు అన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here