హైదరాబాద్:భారతదేశంలో మరో కోవిడ్ నివారణ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.రష్యా అభివృద్ధి పరిచిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ యొక్క తొలి డోసును శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రకటించింది.రష్యా నుంచి తొలి విడతలో 1.5 లక్షల డోసుల స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మే 1న హైదరాబాద్ లోని డా క్టర్ రెడ్డీస్ ల్యాబ్ కు చేరాయి.వీటి దేశవ్యాప్త పంపిణీకి మే 13న కసౌలిలోని సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీ నుండి రెగ్యులేటరీ క్లియరెన్స్ పొందిందని డాక్టర్ రెడ్డి లాబొరేటరీ స్ శుక్రవారం ప్రకటించింది.పరిమిత పైలట్‌లో భాగంగా ఈ టీకా యొక్క సాఫ్ట్ లాంచ్ దేశంలో ఈరోజు జరిగింది.తొలి మోతాదును శుక్రవారం హైదరాబాద్‌లో పంపిణీ చే శారు.రాబోయే రోజుల్లో మరిన్ని డోసుల వ్యాక్సిన్ ను రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకోనుంది.ప్రస్తుతం ఒక డోస్ స్పుత్నిక్ వ్యాక్సిన్ ధర రూ.948 గా నిర్ణయిం చారు.దీనికి 5% జీఎస్టీ అదనం.మొత్తంగా భారతదేశంలో ఒక్క డోస్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ధర రూ.995.40 గా ఉండనుంది.ఈ వ్యాక్సిన్ ను మూడు వారాల వ్య వధిలో రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది.కొంతకాలం తర్వాత భారతీయ ల్యాబరేటరీల్లోనే స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తయారీ ప్రారంభం అవుతుంది. అప్పుడు ఈ వ్యాక్సిన్ ధర కొంతవరకు తగ్గుతుందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వెల్లడించింది.దేశంలో వ్యాక్సిన్ అవసరాలను తీర్చడం కోసం స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను విస్తృతంగా అందు బాటులోకి తీసుకురావడానికి డాక్టర్ రెడ్డీస్ క్యాబ్స్ దేశంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగంలోని వాటాదారులతో కలిసి పని చేస్తుంది. భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి తాము ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నట్లు ఫార్మా దిగ్గజం పేర్కొంది.ఇక ఈ సుత్నిక్ వి వ్యాక్సిన్ కరోనాను అడ్డుకోవడంలో 91 శాతం ప్రభావవంతమైనదిగా క్లినికల్ ట్రయల్స్ లో రుజువైంది.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...