హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు తగ్గినట్లు చెబుతున్నా అనధికారికంగా వైరస్ వ్యాప్తి జరుగుతూనే ఉందని తెలుస్తోంది.దేశంలో మిగతా రాష్ట్రాల కంటే చివరిగా లాక్డౌన్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం టెస్టుల సంఖ్యను మాత్రం పెంచడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.సరైన టెస్టులు చేస్తే వైరస్ లెక్కలన్నీ బయటపడుతాయని అంటు న్నారు.కరోనా కోరల్లో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ చిక్కుకొని బయటపడ్డారు.సామాన్యులు సైతం కరోనా నుంచి కోలుకునేందుకు చర్య లు తీసుకోవాలని ప్రజలు మొత్తుకుంటున్నారు.కరోనా నుంచి కోలుకున్న తరువాత కేటీఆర్ ను కరోనా టాస్క్ ఫోర్స్ ఇన్ చార్జిగా సీఎం ప్రకటించారు.దీంతో ఆయన క రోనా వైరస్ విషయంలో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ అవసరమైన చర్యలు చేపట్టేందుకు రెడీ అయ్యారు.ఎక్కువగా ట్విటర్లో అందుబాటులో ఉండే కేటీఆర్ కు ఓ విషయంపై రిక్వెస్టులు విపరీతంగా వస్తున్నాయి.ప్రతి 4గురిలో ఇద్దరు అదే విషయంపై అడుగుతున్నారు.కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని నెటిజన్లు కే టీఆర్ ను కోరుతున్నారు.పక్క రాష్ట్రం అంధ్రప్రదేశ్లో కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చడం వల్ల చాలా మంది పేదలకు నాణ్యమైన వైద్యం అందుతుందని అంటున్నారు.ప్రభు త్వ ఆసుపత్రిలో కంటే ప్రైవేట్లో చికిత్స మెరుగ్గా ఉండడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు.పేద ప్రజలు ఇప్పటికే ఉన్నదంతా అమ్ముకొని ప్రా ణాల కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అందువల్ల ఆరోగ్య శ్రీ ద్వారా ట్రీట్ మెంట్ ఇప్పించాలని అంటున్నారు.అయితే ఈ విషయంపై కేసీఆర్ స్పందించారు.దీనిపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని రిప్లై ఇచ్చారు.అయితే కొందరు మాత్రం విడిచిపెట్టడం లేదు.ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం ఏముందని సీఎం కేసీఆర్ కు ఈ విష యంపై అవగాహన లేదా..? అని ప్రశ్నిస్తున్నారు.అయితే కేటీఆర్ సీఎంతో ఆరోగ్యశ్రీ ద్వరా కరోనా చికిత్స గురించి చర్చిస్తారా..? లేదా..? అనేది తేలాల్సి ఉంది.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...