అక్రిడేషన్ ఉన్నా,లేకున్నా..కోవిడ్ బాధిత జర్నలిస్టులకు,వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం:శివరాజ్ సింగ్ చౌహాన్

భోపాల్:అక్రిడేషన్ ఉన్నా లేకున్నా కొవిడ్‌-19 బారిన పడిన జర్నలిస్టులందరికీ రాష్ట్రప్రభుత్వం తరపున ఉచిత వైద్యం అందించనున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ప్రకటించారు.రాష్ట్రంలోని ప్రింట్,ఎలక్ట్రానిక్,డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నవాళ్లు ఎవరైనా కోవిడ్ బారిన పడితే అక్రిడేషన్ ఉన్నా లేకున్నా వారి సంరక్షణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని సీఎం తెలిపారు.అంతేకాకుండా జర్నలిస్టుల కుటుంబసభ్యులు కూడా ఎవరైనా కరోనాబారినపడితే వారికి కూడా ఉచితంగానే ట్రీట్మెంట్ అందించనున్నట్లు సీఎం తెలిపారు.ఈ చర్య జర్నలిస్టులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో సహాయపడుతుందని అదేవిధంగా వారి మెరుగైన చికిత్సను కూడా నిర్ధారిస్తుందని ఆయన పేర్కొన్నారు.కాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ వారం ప్రారంభంలో జర్నలిస్టులను కరోనా వారియ ర్స్ ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే.జర్నలిస్టులు వారి విధులను నిర్వర్తించే క్రమంలో కొవిడ్ బారిన పడటం దురదృష్టవశాత్తు కొందరు చనిపోవ డం ఇటీవల మనం చూస్తున్నామని ఓ ప్రకటనలో సీఎం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here