11 రోజుల్లో ఒకే ఇంట్లో నలుగురు కరోనాతో మృతి

మహబూబాబాద్:కరోనా మహమ్మారి మాటలకు అందని విషాదాన్ని మిగులుస్తోంది.కుటుంబాలకు కుటుంబాలనే కబళిస్తోంది.నిత్యం వేల సంఖ్యలు జనాలు కరోనా బలవుతూనే ఉన్నారు.తాజాగా మహబూబాబాద్ జిల్లాలో కరోనా ఓ కుటుంబాన్ని కబళించింది.కేవలం 11 రోజుల తేడాతో ఒకే ఇంట్లో నలుగురు కరోనాతో మృతి చెం దారు.వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో మద్ది బిక్షం-మంగమ్మ(60) దంపతులు నివసిస్తున్నారు.వీరికి ఇద్దరు కుమారులు వీ రన్న(42)ఉపేందర్(39) ఉన్నారు.ఇద్దరు అన్నాదమ్ములు ప్రభుత్వ ఉద్యోగులు.ఇద్దరికీ పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు.ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన రిటైర్డ్ అయి న భిక్షం ఆయన సతీమణి మనుమలతో సంతోషంగా గడిపేవారు.అలాంటి కుటుంబాన్ని కరోనా ఊహించని కుదుపు కుదిపేసింది.మొదట భిక్షం కరోనా బారినపడ్డా రు.ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన ఆయన ఈ నెల 2న ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందారు.ఆ తర్వాత రెండు రోజులకు అంటే 4వ తేదీన పెద్ద కుమారుడు వీ రన్న కూడా కరోనాతో మృతి చెందాడు.ఇద్దరు ఇంటి పెద్దలను కోల్పోయిన దు:ఖం నుంచి తేరుకోకముందే చిన్న కుమారుడు ఉపేందర్‌ తల్లి మంగమ్మలను కూడా క రోనా బలితీసుకుంది.ఈ నెల 11న ఉపేందర్ 13న మంగమ్మ కరోనాతో మృతి చెందారు.కేవలం 11 రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో నలుగురు కరోనాతో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.నలుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.నలుగురు పెద్దలను కోల్పోవ డంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.బాధిత కుటుంబం రోధనలు స్థానికులను సైతం కంటతడి పెట్టిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here