తిరువనంతపురం:కేరళలోని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ)కి చెందిన ఇద్దరు ఫాదర్లు కరోనాతో బుధవారం చనిపోయారు.మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటం కలకలం రేపుతున్నది.ఇడుక్కి జిల్లాలోని మున్నార్ హిల్ స్టేషన్‌లో ఏప్రిల్ 13 నుంచి 17 వరకు సీఎస్ఐ ఆధ్వర్యంలో వార్షిక తిరోగమన కార్యక్రమం జరి గింది.కరోనా నిబంధనలు ఉల్లంఘించి నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అయితే ఇందులో పాల్గొన్న పలువురు కరోనా బారినపడ్డా రు.కరాకోణంలోని సిఎస్ఐ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫాదర్ సి బినోకుమార్ (39),ఫాదర్ వై దేవప్రసాద్ (59) బుధవారం మరణించారు.వారి సహచరులు ఐదుగురు ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు.వారి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు చర్చి వర్గాలు వెల్లడించాయి.మే తొలి వారంలో ఇద్దరు చర్చి ఫాదర్లు చనిపోగా చాలా మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.దీంతో మరింత మందికి కరోనా సోకి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...