మిస్డ్ కాల్ ఇస్తే ఆక్సిజన్ పంపిస్తా:సోనూసూద్

న్యూఢిల్లీ:కరోనా స్వైర విహారం చేస్తున్న దేశ రాజధాని వాసులకు సోనూసూద్ కొండంత అభయ హస్తం అందించాడు.ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పేదవారు ము ఖ్యంగా ఆక్సిజన్ అవసరమై కొనలేని స్థితిలో ఉన్న వారు మిస్డ్ కాల్ ఇస్తే చాలు ఉచితంగా ఆక్సిజన్ పంపించే ఏర్పాట్లు చేశాడు.ప్రస్తుతం ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆక్సిజన్ కోసం హాహకారాలు చేస్తున్న విషయం తెలిసిందే.కోర్టులు తీవ్రంగా స్పందించినా ఆచరణలో తీవ్రమైన కటకటతో డబ్బు పెట్టినా ఎక్కడా లభించని పరిస్థితి ఉంది.ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఆదుకోండి అంటూ హాస్పిటల్స్ రోగులు ఆర్తనాదాలు చేస్తూ సోషల్ మీడియాలో చేస్తున్న వైరల్ అవుతున్న ఘటనలు చూస్తున్నవే వింటున్నవే.ఢిల్లీలో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఈ దారుణమైన పరిస్థితులపై దృష్టి సారించిన సోనూసూద్ చెప్పినట్లే చాలా వేగంగా ఏర్పాట్లు చేశాడు.విదేశాల నుంచి ఆక్సిజన్ ప్లాంట్లకు ఆర్డర్లు ఇచ్చి వాటిని సమకూర్చుకుంటున్నాడు.ఇప్పటికే కొద్దిపాటి స్టాక్ రావడంతో వెంటనే కార్యాచరణ ప్రకటన చేశాడు.ఆక్సిజన్ కాన్సంట్రే టర్ అవసరమైన వారు ఈ నెంబర్ 022-61403615 కు మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకుంటే వెంటనే ఉచితంగా అందించే ఏర్పాటు చేశాడు.రానున్న రోజుల వ్యవ ధిలోనే మరిన్ని ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వస్తున్నాయని ఆక్సిజన్ కొనలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ఉచితంగా అందించి వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలు కాపాడడ మే తన లక్ష్యమని సోనూసూద్ అంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here