పెట్రో మోత..సెంచరీకి చేరువలో

న్యూఢిల్లీ:దేశంలో మరోసారి పెట్రో మోత మోగింది.ఒకరోజు విరామం తర్వాత చమురు ధరలను పెంచుతూ ఆదివారం విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.లీట రు పెట్రోల్​పై 24పైసలు,లీటరు డీజిల్​పై 27పైసలను పెంచాయి.తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్​ ధర లీటరుకు రూ.92.58,డీజిల్​ ధర రూ. 83.22కు చేరాయి.హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.96.22,డీజిల్ రూ.90.73గా ఉన్నాయి.ఇప్పటికే మహారాష్ట్ర,మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో లీటర్‌ పెట్రో ల్‌ ధర రూ.100 దాటిన విషయం తెలిసిందే.ఇక ముంబయిలో త్వరలోనే సెంచరీ కొట్టే దిశగా సాగుతున్నాయి.ఇంధన ధరల్లో రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటాయే అధికంగా ఉండడం గమనార్హం.కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ పన్ను కింద లీటర్‌ పెట్రోల్‌పై రూ.32.90,డీజిల్‌పై రూ.31.80 వసూలు చేస్తోంది.వివిధ నగరాల్లో పెట్రోల్ (లీ టర్‌ రూ.లలో)డీజిల్‌(లీటర్‌ రూ.లలో)కోల్‌కతా 92.67-86.06,ముంబై 98.88-90.40,బెంగళూరు 95.33-87.92,హైదరాబాద్‌ 96.22-90.73,తిరువ నంతపురం 94.81-89.70,చెన్నై 94.31-88.07 లు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here