అంతిమ యాత్రలో కళ్లు తెరిచిన 76 ఏళ్ల బామ్మ

నాగపూర్:మహారాష్ట్రలోని ముధాలే బారామతి గ్రామంలో కరోనా సోకి చనిపోయిందనుకున్న 76 ఏళ్ల వృద్ధురాలు అంతిమ యాత్రలో ఒక్కసారిగా కళ్లు తెరిచింది.అం తే అందరూ షాక్ అయ్యారు.అటునుంచి అటే ఆసుపత్రికి తీసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది.బారామతి గ్రామానికి చెందిన శకుంతల గైక్వాడ్‌ అనే 76 బామ్మకు అ నారోగ్యం చేసింది.దీంతో మే 10న ఆమెకు కరోనా పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.దీంతో కుటుంబ సభ్యులు ఆమెను కారులో ఆసుపత్రికి తీ సుకెళ్లారు.కానీ దేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితే అక్కడ కూడా ఉంది.ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా అది ఫుల్ అయ్యిందని బెడ్స్ ఏమీ లేవని చెప్పారు.దాంతో మ రో ఆసుపత్రికి తీసుకెళ్లారు.అలా ఎన్ని ఆసుపత్రులకు తిరిగినా అదే పరిస్థితి.బెడ్స్ లేవు బెడ్స్ లేవు అనే సమాధానం.దీంతో చేసేదేమీ లేక శకుంతలను కారులోనే ఉంచేయాల్సి వచ్చింది.ఈ క్రమంలో ఆమెకు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.కుటుంబ సభ్యులు ఆమెను ఎంతగా తట్టి లేపినా ఏమాత్రం చలనం లేదు.కుదిపి కుది పి చూశారు.కానీ ఫలితం లేదు.దీంతో ఆమె మరుణించిందని భావించి ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు.బంధువులకు సమాచారం అందించారు.అ లా అంతిమ యాత్ర నిర్వహిస్తుండగా ఆమె ఒక్కసారిగా కళ్లు తెరిచింది.ఈ విషయాన్ని అంతిమ యాత్రలో ఉన్న బంధువులు గుర్తించారు.అరే బామ్మ బతికే ఉంది.అ ని చెప్పటంతో అందరూ షాక్ అయ్యారు.ఆ తరువాత ఆమె బ్రతికే ఉందని గుర్తించి అటునుంచి అటే ఆసుపత్రికి తరలించి బతిమాలి బతికించి ఏదోరకంగా చికిత్సనందే లా చేశారు.దీంతో ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here