నాయిని అల్లుడి ఇంట్లో ఈడీ సోదాలు..కళ్లు చెదిరే నగదు..

హైదరాబాద్:రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి శనివారం(ఏప్రిల్ 10) ఈడీ హైదరాబాద్‌లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది.దా దాపు 10కి పైగా ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించింది.ఇందులో భాగంగా మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.గతంలో నాయిని దగ్గర పీఏగా పనిచేసిన ముకుంద రెడ్డి,ఈఎస్ఐ కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న దేవికా రాణి ఇళ్ల ల్లోనూ సోదాలు జరిగాయి.సోదాల సందర్భంగా నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది.సోదాల్లో పలు కీలక పత్రాలతో పాటు రూ.1కోటి నగదు,బ్లాంక్ చెక్కులు,ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.రెండేళ్ల క్రితం తెలంగాణలో ఈఎస్ఐ కుంభకోణం సంచ లనం సృష్టించిన సంగతి తెలిసిందే.వైద్య కిట్లు,మందుల కొనుగోళ్ల విషయంలో ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ దేవికారాణి నకిలీ బిల్లులు సృష్టించి వందల కోట్ల రూపాయలు కాజేశారన్న ఆరోపణలున్నాయి.ఈ కేసులో దేవికారాణితో పాటు తొమ్మిది మందిని ఇప్పటికే ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.ఇప్పటికే అవినీతి అధికారిణి దేవికా రాణి నుంచి ఏసీబీ అధికారులు రూ.4.47 కోట్ల నగదును గతేడాది సెప్టెంబరులో స్వాధీనం చేసుకున్నారు.ఆమె కుటుంబ సభ్యులు చిట్ ఫండ్ కంపెనీల్లో,రియల్ ఎస్టేట్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు.అంతేకాదు,దేవికా రాణి ఎనిమిది డొల్ల కంపెనీలను కూడా ఏర్పాటు చేసినట్లు కూడా గుర్తించారు.ఇదే కే సులో నిందితురాలిగా ఉన్న సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రి నాగలక్ష్మి దాదాపు రూ.50కోట్ల వరకూ అక్రమాస్తులు కూడబెట్టినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి.దేవికా రాణి,ఈఎస్ఐ వ్యవస్థలోని పలువురు అధికారులు కలిసి అవసరం ఉన్నా లేకపోయినా మందులు,వైద్య పరికరాలు కొనుగోలు చేసి అసలు కన్నా ఎక్కువ ధరలతో బిల్లులు సృష్టించి ఈ స్కామ్‌కి తెరలేపారు.తాజాగా ఈడీ నిర్వహించిన సోదాలకు సంబంధించి అధికారిక వివరాలు బయటకు రావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here