తెలంగాణలో ప్రశ్నించే ప్రతిపక్షమే లేదు..ప్రశ్నించడానికి పార్టీ అవసరం..షర్మిల

ఖమ్మం:ఖమ్మం సంకల్ప సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను వైఎస్ షర్మిల టార్గెట్ చేసింది.పంచ్ డైలాగులు,ఘాటైన ఆరోపణలతో విరుచుకుపడింది.సర్కా ర్ వైఫల్యాలను ఎత్తిచూపుతు ప్రశ్నల వర్షం కురిపించింది.సాగు ప్రాజెక్టుల్లో కేసీఆర్‌ ఎంతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.కేసీఆర్‌ అవినీతిని ప్రశ్నించడానికి తన పార్టీ అవసరమన్నారు.తెలంగాణలో రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారని,రైతుల పేరుతో అప్పులు తెచ్చి పాలకులు జేబులు నింపుకుంటున్నారని దుయ్యబట్టా రు.దొర చెప్పుకింద తెలంగాణ నలిగిపోతుందన్నారు.కేసీఆర్‌ తాను తప్పు చేస్తే ముక్కు రాస్తా అన్నాడని,అన్ని వర్గాలకు న్యాయం జరిగిందా? అని షర్మిల ప్రశ్నిం చారు.బంగారు తెలంగాణ సాధ్యమైందా అని నిలదీశారు.కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలంగాణ రాష్ట్రం బానిసైందా? అనిప్రశ్నించారు.దొర దయతలచి ఇస్తే తీసుకోవాలి.లే దా నోరు మూసుకోవాలా? అని ప్రశ్నించారు.కేసీఆర్‌ ఎన్నికలకు ముందు ఒకలా తర్వాత మరోలా మారిపోతారని దుయ్యబట్టారు.నిలబెట్టుకోని హామీల గురించి కాం గ్రెస్‌ మాత్రం నిలదీయదని ఆమె తప్పుబట్టారు.కాంగ్రెస్‌,టీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యేలను సప్లై చేసే కంపెనీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రానికి బీజేపీ ఇచ్చిన హా మీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు.రాష్ట్రంలో పాలక పక్షాన్ని ప్రశ్నించే ప్రతిపక్షమే లేదన్నారు.ఎవరు ఏమన్నా తాను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనేనని షర్మిల మరోసారి స్పష్టం చేశారు.

కేసీఆర్‌ చెప్పిన కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది? అని షర్మిల ప్రశ్నించారు.ప్రైవేట్‌ రంగంలోనూ వైఎస్‌ 11 లక్షల ఉద్యోగాలు కల్పించారని,ఇప్పుడు యువతకు ఉ ద్యోగాలు లేవు.నిరుద్యోగ భృతి ఏమైంది? అని మరోసారి ప్రశ్నించారు.వైఎస్‌ హయాంలో 46 లక్షల పక్కా ఇళ్లు కట్టించారని గుర్తుచేశారు.కేసీఆర్‌ ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలని నిలదీశారు.ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు అన్నారు.ఏమైందని ప్రశ్నించారు.అడిగిన ప్రతి ఒక్కరికి వైఎస్‌ తెల్లరేషన్‌ కార్డు ఇచ్చారని, 108 అంబులెన్స్‌ల ఆలోచన వైఎస్‌ తప్ప ఏ నాయకుడూ చేయలేదని షర్మిల పేర్కొన్నారు.కేసీఆర్‌ హయాంలో ఒక్క కొత్త కార్డు రాలేదని తప్పుబట్టారు.కేసీఆర్‌ హ యాంలో పెన్షన్లు లేవని,కార్పొరేషన్లకు నిధులు లేవని విమర్శించారు.దళితులకు మూడెకరాల భూమి ఏమైంది సీఎం సారూ? అని షర్మిల ప్రశ్నించారు.ఉద్యమంలో అమరులైనవారికి నా వందనాలు.తెలంగాణ వచ్చాక కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి.6 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.రాష్ట్రం రైతు ఆత్మ హత్యల్లో దేశంలోనే 2వ స్థానంలో ఉంది.యువత ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.30 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు చీమ కుట్టినట్లు లేదు.ఆత్మగౌరవం దొర చెప్పుకింద పడి నలిగిపోతోంది.నీళ్లన్నీ కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే నిధులు కూడా వారికే నియామకాలు కూడా కేసీఆర్‌ కుటుంబానికే ఉ ద్యమంలో పనిచేసిన వారిని పక్కన పడేశారు అని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.కేసీఆర్‌ హయాంలో పెన్షన్లు లేవు,కార్పొరేషన్లకు నిధులు లేవు.దళితులకు మూడెకరాల భూమి ఏమైంది సీఎం సారూ? అభివృద్ధి,సంక్షేమం రెండు కళ్లుగా వైఎస్‌ పాలన సాగింది.వైఎస్‌ ప్రజాదర్బార్‌లో వందల మంది కష్టాలు తీర్చారు.ఇప్పు డున్న నాయకుడు ఏ ఒక్కడైనా అలా ఉన్నాడా? ప్రజా సమస్యలు వినే ఓపిక ఈ దొరలకు ఉందా అని షర్మిల ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here