ఐపీఎల్ 14 సీజన్ తొలి మ్యాచ్ లో బెంగళూరు గెలుపు

చెన్నై:క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14 సీజన్ ప్రారంభమైంది.టైటిల్ ఫేవరెట్లుగా ఉన్న ముంబయి ఇండియ న్స్,రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా కొనసాగింది.ఈ మ్యాచ్‌లో చివరకు బెంగుళూరు జట్టు విజయం సాధించింది.చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఉత్కంఠభరితంగా కొనసాగిన ఈ మ్యాచ్ లో చివరిబంతికి రెండు పరుగులు రాబట్టి విరాట్ కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు జట్టు విజ యం సాధించింది.తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబయి జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లను కోల్పోయి159 పరుగులు చేసింది.క్రిస్‌లిన్ 49,సూర్యకుమార్ యా దవ్ 31 పరుగులతో రాణించారు.బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.160 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బెంగ ళూరు జట్టు చివరిబంతివరకు పోరాడి విజయం సాధించింది.మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ 48 పరుగులు,గ్లెన్ మ్యాక్స్ వెల్ 39,కెప్టెన్ విరాట్ కోహ్లీ 33 పరుగులతో రాణించారు.ఐదు వికెట్లతో రాణించిన హర్షల్ పటేల్ ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ వరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here