మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ఆరంభం..

చెన్నై:అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ సమరం నేటి నుంచి షురూ అవుతోంది.ఐపీఎల్ అంటేనే అద్భుతాలు జరుగుతుంటాయి.ప్రతి క్షణం నిజం గా ఒక యుద్ధంలా ఉంటుంది.ఎవరు గెలుస్తారు అనేది ఆఖరి క్షణం వరకు ప్రశ్నార్థకమే.ప్రతి బంతి కూడా క్రికెటర్లకు ఛాలెంజింగ్ గా ఉంటుంది.ఈసారి యుద్ధంలోకి ఎ నిమిది జట్లు వస్తున్నాయి.ఈ క్రికెట్ పండుగ మరికొన్ని గంటల్లో స్టార్ట్ అవుతుంది.అయితే ఇందులో విజయం సాధించేది ఎవరు.? ఐపీఎల్ కప్ గెలుచుకునేది ఎవ రు.? ఈ 2021 ఐపీఎల్ స్టార్ట్ అవకుండానే మనం గతంలో జరిగిన మ్యాచ్ లకు సంబంధించి కొన్ని విషయాలు మరియు ఐపీఎల్ కప్పు పొందిన జట్లు గురించి చూ ద్దాం.2008లో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ కప్పుని సార్ధకం చేసుకుంది.2009లో డెక్కన్ చార్జెస్ కప్ పొందింది.2010 మరియు 2011లో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ కప్ గెలుచుకుంది.2012లో కలకత్తా నైట్ రైడర్స్ ఐపిఎల్ కప్ ని సార్థకం చేసుకుంది.2013 లో ముంబయ్ ఇండియన్స్ విన్నర్ అయ్యింది.2014 లో క లకత్తా నైట్ రైడర్స్ మరోసారి గెలిచింది.2015 లో ముంబాయ్ ఇండియన్స్ కప్ గెలుచుకుంది.2016 లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలిచింది.2017 లో ముంబాయ్ ఇండియన్స్ కప్ గెలుచుకుంది.2018 లో చెన్నై సూపర్ కింగ్స్ కప్ ని దక్కించుకుంది.2019,2020 సంవత్సరాల్లో తిరుగు లేకుండా వరుసగా ముం బాయ్ ఇండియన్స్ ఐపీఎల్ కప్ ని గెలుచుకున్నారు.మరి ఈ ఏడాది ఐపీఎల్ కప్ ని ఎవరు గెలుకుంటారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here