మావోల చెరలో ఉన్న రాకేశ్వర్ సింగ్ విడుదల..?

రాయ్‌పూర్‌:ఐదు రోజుల ఉత్కంఠకు తెర పడింది.మావోయిస్టు ల చెరలో బందీగా ఉన్న సీఆర్‌పీఎఫ్‌ కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ ఎట్టకేలకు విడుదల అయ్యాడు. తమ చెరలో ఉన్న రాకేశ్వర్‌ సింగ్‌ను మావోయిస్టులు విడిచిపెట్టారు.ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఈనెల 3వ తేదీన సీఆర్పీఎఫ్ జవాన్లు,మావోయిస్టులకు మ ధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.కాల్పుల అనంతరం కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్‌ను మావోయిస్టులు బంధీగా పట్టుకు న్నారు.ప్రభుత్వంతో తాము చర్యలకు సిద్ధంగా ఉన్నామని తమ వద్ద బంధీగా ఉన్న రాకేశ్వర్ సింగ్‌కు ఎలాంటి హాని తలపెట్టమని ముందుగానే ప్రకటించారు.గురువా రం అతన్ని విడుదల చేస్తున్నట్లు మావోయిస్టులు తెలిపారు.ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్ ఐజీ ధ్రువీకరించారు.అంతకుముందు పోలీసులకు తమకు ఎలాంటి వైరం లేద ని ప్రభుత్వం తరఫున వారు పోరాడుతున్నందునే తాము అటాక్ చేశామని చెప్పుకొచ్చారు.జవాన్లు మాకు శత్రువులు కాదు.మా పోరాటం ప్రభుత్వంతోనే,ఎన్కౌంట ర్లకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని,తన తండ్రిని వదిలిపెట్టాలంటూ సీఆర్పీఎఫ్ జవాన్ రాకేశ్వర్‌ సింగ్ కూతురు మావోయిస్టులకు విజ్ఞప్తి చేసిన విష యం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here