సంపూర్ణ లాక్ డౌన్ విధించాల్సిందే:సీఎం ఉద్ధవ్ థాక్రే

ముంబై:భారత్ లో సగానికి పైగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి.కరోనా ఫస్ట్ వేవ్‌లో నమోదైన పాజిటివ్ కేసుల రికార్డును సెకండ్ వేవ్ ఎప్పు డో దాటేసింది.దీంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కఠిన నిబంధనలు నైట్ కర్ఫ్యూ ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు సంపూర్ణ లాక్ డౌన్ తప్పదని సంచ లన వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే లాక్‌డౌన్ విధించడం మినహా వేరే గత్యంతరం లేదని ఇతర మార్గాలు కూడా కనిపించడం లేదని ఇవాళ నిర్వహించి న ఆల్ పార్టీ మీటింగ్‌లో సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం నెల పాటు లాక్‌డౌన్ విధిస్తే పరిస్థితి అదుపులోకి వస్తుందని దీనికి మీరంతా సహకరించాలని ఆయన రా జకీయ పక్షాలకు విజ్ఞప్తి చేశారు.ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య పరిస్థితులు మరింత దారుణంగా మారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన థాకరే లాక్‌డౌన్ విధించడం తప్ప వేరే మార్గం లేదని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here