గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్..13 మంది మావోయిస్టులు మృతి.?

గడ్చిరోలి:ఒకపక్క కనిపించని కరోనా మహమ్మారితో దేశ ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే మరోవైపు మహారాష్ట్రలో శుక్రవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుం ది.గడ్చిరోలి జిల్లాలోని ఎటపల్లి అటవీ ప్రాంతంలోవద్ద సీ-60 యూనిట్‌ మహారాష్ట్ర పోలీసులకు మావోయిస్టులకు మధ్య పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి.అ యితే పోలీసుల కాల్పుల్లో ఏకంగా 13 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.మృతుల సంఖ్య ఇంకా ఉండవచ్చని భావిస్తున్నారు.ఇప్పటి వరకు 13 మృతదేహాలను ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కాల్పులు కొనసాగుతుండడంలో ప్రస్తుతం గడ్చిరోలి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోం ది.కాగా పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెందడంతో దండకారణ్యం నెత్తురోడింది.ధనోరా తాలుకా కోట్మీ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండ గా పోలీసులకు మావోయిస్టులు ఎదురు పడ్డట్టు సమాచారం.ప్రస్తుతం ఏటపల్లిలో ఏరియాలో పోలీసులు గాలింపు చర్యలు,కూంబింగ్ కొనసాగిస్తున్నారు.ఘటనా స్థలి లో కొన్ని ఆయుధాలు,విప్లవ సాహిత్యం,ఇతర వస్తువులను భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు గడ్చిరోలి డీఐజీ సందీప్‌ పాటిల్‌ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here