హైదరాబాద్:ఈటల రాజేందర్ టీఆర్ఎస్ సభ్యులు హుజురాబాద్ ఎమ్మెల్యే,నర్సాపురం ఎంపీ ఇద్దరూ ఇద్దరే ఎవరి స్థాయిలో వారు మంచి నాయకులే.వారిరువురూ స్వపక్షంలో విపక్షంగా మారారు.బాస్‌లకు పక్కలో బల్లెంలా మారారు.అందుకే సొంత పార్టీలకే టార్గెట్ అయ్యారు.ఏ పార్టీ నుంచి అయితే ఎన్నికయ్యారో అదే పార్టీ నుంచి ముప్పు ఎదుర్కొంటున్నారు.ఏ అధినేతలకైతే వాళ్లు జై కొట్టారో ఇప్పుడు అదే అధినేతలు వాళ్లను ఏకాకులను చేసి కేసుల్లో ఇరికించి ఉక్కిరిబిక్కిరి చేస్తు న్నారు.ఏపీలో రఘురామ,తెలంగాణలో ఈటల టార్గెట్‌గా రాజకీయం రంజుగా సాగుతోంది.రఘురామకృష్ణరాజు జగన్ టికెట్ ఇస్తే వైసీపీ తరఫున నర్సాపురం ఎంపీగా గెలిచారు.జగన్ సీఎం అయ్యాక ఆయన అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సహించలేకపోయారు.అందుకే ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రివి తప్పుడు నిర్ణ యాలంటూ తూర్పారబడుతూ వచ్చారు.అంతే తప్పును తప్పని చెబితే జగన్ తట్టుకోలేకపోయారు.తన పార్టీ నేతలను రఘురామపై ఉసిగొల్పారు.అప్పటి నుంచి ఏపీలో జగన్ వర్సెస్ రఘురామ,వైసీపీ వర్సెస్ ఆర్ఆర్ఆర్ ఎపిసోడ్ వాడి-వేడిగా సాగింది.ప్రాణభీతితో కేంద్రం నుంచి తెచ్చుకున్న సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ రక్షణతో కొ న్నాళ్లుగా ఢిల్లీలో సురక్షితంగా ఉంటూ వచ్చారు రఘురామ.సేమ్ టూ సేమ్ తెలంగాణలోనూ అంతే ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఉద్యమం కాడినుంచి కేసీఆర్ వెంట ఉన్న నాయకుడు.అందుకే ఆయన తాను గులాబీ జెండకు బానిసలం కాదు.ఓనర్లం అంటూ రెబెల్ జెండా ఎగరేశారు.ఆత్మాభిమానం కోసం అధినేతకు దూరమయ్యా రు.పార్టీ ప్రభుత్వ అంతర్గత విషయాలు బయటకు లీక్ చేస్తున్నారని వేరే పార్టీలతో టచ్‌లో ఉన్నారనే అనుమానంతో కేసీఆర్ ఈటలను చాలా రోజులుగా దూరం పెట్టా రు.ఎంపీ రఘురామ దొరికింది ఛాన్స్ అంటూ రఘురామ ఇంటిపై దాడి చేశారు ఏపీ సీఐడీ పోలీసులు.ఆయన్ను అరెస్ట్ చేసి గుంటూరుకు తీసుకెళ్లడం ఆయన కోర్టు లకెళ్లడం తన కొట్టారంటూ ఫిర్యాదు చేయడం ఎంపీని జైలుకు తరలించడం సుప్రీంకోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చేరడం కోర్టు ఉల్లంఘనపై ఏపీ స ర్కారుకు హైకోర్టు నోటీసులు ఇవ్వడం ఇలా వేగంగా పరిణామాలు మారుతూ వచ్చాయి.తెలంగాణలోనూ అంతే ఉన్నట్టుండి మంత్రి ఈటలపై భూకబ్జా ఆరోపణలు రా వడం వెంటనే విచారణ కమిటీ వేయడం గంటల వ్యవధిలోనే నివేదిక రావడం రాత్రికి రాత్రే ఆయన్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం.ఇలా 20 ఏళ్ల పాటు టీఆర్ఎస్ లో కేసీఆర్ వెంట ఉన్ననేతను ఒక్కరోజులోనే అవినీతిపరుడిగా,పార్టీ ద్రోహిగా ముద్రేసి పక్కన పెట్టడం కేసీఆర్ తరహా కంత్రీ పాలిట్రిక్స్‌కు నిదర్శనం.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...