తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్..?క్లారిటీ ఇచ్చిన హెల్త్ డైరెక్టర్

హైదరాబాద్:దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ పంజా విసురుతోంది ముఖ్యంగా ఎనిమిది రాష్ట్రాల్లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి.దీంతో కొన్ని ప్రాం తాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోతున్నారు.కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ కాకపోయినా కఠిన రూల్స్ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.మరోవైపు తెలంగాణలోనూ పాజి టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.ముఖ్యంగా గురుకులాలు,హాస్టళ్లు,స్కూళ్లలో కోవిడ్ కేసులు కలవరపెడుతున్నాయి.దీంతో తెలంగాణలోనూ మరోసారి లాక్‌డౌన్ వి ధించే ఆలోచనలో ఉన్నారని కర్ఫ్యూ ప్రపోజల్ ఉందనే ప్రచారం సాగింది.దీనిపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు క్లారిటీ ఇచ్చారు.రాష్ట్రంలో లాక్‌డౌన్కానీ,కర్ఫ్యూ ప్రపోజల్ కానీ పెట్టలేదన్న ఆయన విద్యాసంస్థల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి విద్యార్థుల ద్వారా ఇంట్లో ఉన్న వృద్ధులకు,దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రమాదం పొంచిఉందని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల చూస్తే సెకండ్ వెవ్ అనే చెప్పాలన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీని వాస్‌రావు గత ఏడాది ఏ చర్యలు చెపట్టామో అవే మళ్లీ ప్రారంభించామన్న ఆయన ప్రజల నుండి మద్దలు కావాలి.దయచేసి మాస్క్‌లు ధరించండి అంటూ విజ్ఞప్తి చేశారు.మరోవైపు వ్యాక్సిన్ కు అర్హులైన వారు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.వ్యాక్సిన్ వల్ల కరోనా తీవ్రత ఎక్కువ కాకుండా ఉంటుందన్న శ్రీనివాస్ రావు కరోనా కట్టడికి అన్నీ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here