న్యూఢిల్లీ:దేశంలో కరోనా కేసులు రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి.ప్రతీ రోజూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.24 గంటల్లో దేశవ్యాప్తంగా 11 లక్షల 33 వేల మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా 46,951మందికి పాజిటివ్‌గా తేలింది.అంతకుముందు రోజుతో పోలిస్తే సుమారు మూడు వేల కేసులు పెరిగాయి.ఇక కరోనా మరణాలు కూడా 24 గంటల వ్యవధిలో 212 నమోదయ్యాయి.అంతకుముందు రోజు 197 మరణాలు నమోదయ్యాయి.పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు రోజువారీ మరణాల్లోనూ పెరుగుదల కనిపిస్తుండటంతో అందరిలో ఆందోళన పెరిగిపోతోంది.అధికారులు ఎన్ని సూచనలు చేస్తున్నా ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసు కుంటున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు.తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పాఠశాలలు కాలేజీలు హాట్ స్పాట్‌లుగా మారుతున్నాయి.కరోనా బారిన పడుతున్న వి ద్యార్థులు టీచర్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.దీంతో ఇండియాలో ఇప్పటివరకు 1,16,46,081 కేసులు నమోదయ్యాయి.ఇందులో 1,11,51,468 మంది కోలుకొని డిశ్చార్జి కాగా 3,34,646 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో ఇండియాలో 21,180 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.అయితే డి శ్చార్జ్ కేసుల కంటే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...