హైదరాబాద్:తెలంగాణలో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానున్నది.ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టింది తెలంగాణ ప్రజానీకం.పోరాడి ఓడినా ప్రజాభిమానం సొంతం చేసుకున్నారు స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న.ఇప్పుడు తాజాగా ఆయనో నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయా లని ఆయన సంకల్పించారు.తెలంగాణలోని ప్రతి గడప ఆయన తట్టి రావాలని భావిస్తున్నారు.నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన తీన్మార్ మల్లన్నకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.అధికార పక్షం అరాచకాలపై గొంతెత్తిన మల్లన్నకు ఓట్లతో మద్దతు తెలిపారు.అధికార పార్టీ అభ్యర్థి,ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహితుడికి ముచ్చెమటలు పట్టించారు.దుబ్బాక,జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయాలతో ఊపుమీదున్న బీజేపీ దూకుడుకు సైతం కళ్లెం వేసి మరీ సామాన్యు డి వెన్నుతట్టారు.ఇక కాంగ్రెస్ ముందే చేతులెత్తేసింది.టీజేఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోదండరాం కూడా వెనకబడిపోయారు.ఎట్టకేలకు అధికార టీఆర్‌ఎస్ తమ సిట్టింగ్ సీటును అతి కష్టమ్మీద నిలబెట్టుకోగలిగింది.తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రజలు తన ద్వారా పోరాటం చేయాలని భావించారని అందుకు ఈ ఫలితా లే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.రాజకీయ పార్టీలు ప్రజలకు దూరమయ్యాయని ఇప్పటికైనా నేతలు బుద్ది తెచ్చుకుని ప్రజలకు చేరువ కావాలని ఆయన ఆకాంక్షించారు.ఇకపై బ్యాలెట్ యుద్ధం చేయబోతున్నానని ప్రతి గడపకూ పోతానని ఆయన ప్రకటించారు.
