మతం..మంచినీళ్లు కూడా తాగనీయదట..

లక్నో:సమాజంలో రోజురోజుకు మానవత్వం కనుమరుగై పోతుంది. చిన్న చిన్న కారణాలకే ముసలి చిన్న పిల్లల పట్ల వారి విచక్షణ కోల్పోయి కొందరు మృగాలుగా ప్రవర్తిస్తున్నారు.అన్నదానం కన్నా నీటి దానం గొప్పది అని అంటుంటారు.కానీ ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని ఓ దేవాయలంలో నీళ్లు తాగిన ఓ బాలుడిని దారుణం గా కొట్టిన విషయం తెలిసిందే.ఇక దాహంగా ఉన్న బాలుడు తాగునీళ్లు తాగటానికి యూపీలోని ఘజియాబాద్‌లో గల డస్నా దేవి మందిరం వద్దకు వచ్చాడు.కానీ మతోన్మాదం గల శృంగీ నందన్ యాదవ్ అనే వ్యక్తి మంచినీళ్లు తాగుతున్న బాలుడి వద్దకొచ్చి ‘నీ పేరు ఏమిటి?’ అని అడిగాడు.దానికి ఆ బాలుడు ‘నా పేరు అసి ఫ్’అని సమాధానం ఇచ్చాడు.ఈ మాట విన్నవెంటనే యాదవ్ ఆ బాలుడిని చేతులు వెనక్కి విరిచి పట్టుకుని కొట్టాడు.కిందపడవేసి చితక బాదాడు.ముస్లిం అయి ఉండి హిందూ దేవాలయంలోకి వస్తావా?ఇక్కడి నీళ్లు తాగి కలుషితం చేస్తావా?అంటూ చితకబాదాడు.ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కలకలం సృష్టించింది.అమ్మో,దేవుళ్ళు,బాబాలు,గ్రంధాలు లేకపోతే ఈ దేశం ఏం కాను,ఇక్కడ రాజకీయాలు,పార్టీలుండవ్ అపచారం మేము మనుషులం కాము అన్నా ఒకే కాని జ్సంతువుల్లాగా ప్రవర్తిస్తారాడానికి ఉదాహరణ ఇదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here